మొన్న పదహారో తేదీ విడుదలైన సినిమాలు మరీ దారుణంగా దెబ్బ తినడంతో ట్రేడ్ తీవ్ర నిరాశలో ఉంది. అంచనాలు జీరో కాకపోయినా టాక్ బాగుంటే ఈజీగా జనాన్ని రప్పించే కంటెంట్ ఉన్నవిగా ఓ మోస్తరు బజ్ తోనే థియేటర్లలో అడుగు పెట్టాయి. ముఖ్యంగా ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నేను మీకు బాగా కావాల్సినవాడిని కనీసం యావరేజ్ అయినా చాలనుకున్నారు. కట్ చేస్తే డిజాస్టర్ల ఖాతాలో పడిపోయాయి. దాదాపు అన్ని చోట్ల వసూళ్లు తీసికట్టుగా మారాయి.
ఇప్పుడు రాబోయే శుక్రవారం మీదే అందరి చూపు నిలుస్తోంది. శ్రీవిష్ణు హీరోగా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన అల్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ అతిథిగా రావడంతో జనాల దృష్టిని తనవైపుకి తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యింది. ట్రైలర్ లో చూపించినట్టే మాస్ ని ఆకట్టుకునే అంశాలుంటే మాత్రం మరో హిట్టు ఖాతాలో పడినట్టే. నాగశౌర్య పాదాలకు శ్రమ కలిగించి మరీ వందల కిలోమీటర్లు నడుస్తున్న కృష్ణ వృందా విహారి సైతం బజ్ కోసం తాపత్రయపడుతున్నదే. ప్రమోషన్లు గట్రా ఓకే కానీ ఫ్రైడే మార్నింగ్ షో పబ్లిక్ రెస్పాన్స్ మీద దీని భవిష్యత్తు ఆధారపడి ఉంది.
మొన్న శాకినీ డాకినితో షాక్ తిన్న సురేష్ ప్రొడక్షన్స్ దీని ఫలితం ముందే ఊహించింది కాబోలు కేవలం వారం గ్యాప్ లో తన నిర్మాణ భాగస్వామ్యంలోనే రూపొందిన మరో సినిమా దొంగలొస్తున్నారు జాగ్రత్తను దింపుతోంది. టాలీవుడ్ ఫస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ గా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఓటిటిలో బాగా వర్కౌట్ అయ్యే ఇలాంటి కథలు తెరమీద మెప్పించేలా ఎలా చూపిస్తారో వెయిట్ చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అవతార్ ని స్పెషల్ గా రీ మాస్టర్ చేసి 23నే రిలీజ్ చేస్తుండటం వీటిని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే అవతార్ ఫ్యాన్స్ మాములుగా లేరు. మరి ముగ్గురు కుర్రాళ్ళు టికెట్ కౌంటర్లని కళకళలాడిస్తారా చూద్దాం
This post was last modified on September 20, 2022 7:49 am
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…