ఇవాళ అఫీషియల్ గా ప్రారంభోత్సవం జరుపుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 13వ సినిమా తాలూకు ప్రీ లుక్ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తి రేపింది. ఇండియన్ ఏవియేషన్ ఆఫీసర్ గా చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ ని వరుణ్ పోషించబోతున్నాడు. దీని కోసమే ప్రత్యేకంగా ఫిట్ నెస్ ట్రైనింగ్ కూడా తీసుకున్న ఈ మెగా హీరో గని డిజాస్టర్ తాలూకు దెబ్బ నుంచి త్వరగానే బయటికి వచ్చి దీనికి రెడీ అవుతున్నాడు. అయితే మరోసారి డెబ్యూ దర్శకుడిని నమ్ముకోవడం పట్ల ఫ్యాన్స్ లో అనుమానం లేకపోలేదు. అయితే ఆ అబ్బాయి బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదు.
అతని పేరు శక్తి ప్రతాప్ సింగ్ హడా. ఆర్క్ ఫిలిమ్స్ అనే స్వంత బ్యానర్ ఉంది. పంజాబ్ నేషనల్ లా యూనివర్సిటీ నుంచి బిఏఎల్ఎల్బి చేశాడు. యువతగా ఉన్నప్పుడు చైతన్యవంతమైన కార్యక్రమాలు చేశాడు. ఇండియన్ గవర్నమెంట్, బిజెపి, నెస్ కఫే, మ్యాగీ, సెర్లాక్, హెర్మోసా తదితర సంస్థల ఉత్పత్తులకు వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ మీద రాసుకున్న స్క్రిప్ట్ తోనే వరుణ్ మూవీ బ్యాక్ డ్రాప్ సెట్ చేశాడట. ఇతనికి ఏరియల్ ఫోటోగ్రఫీలో మంచి నైపుణ్యం ఉంది. బాలీవుడ్ లోనూ అనుభవం గడించాడు.
అసిస్టెంట్ డైరెక్టర్ గా బద్రీనాథ్ కి దుల్హనియా, ధఢక్, కేసరి, గుడ్ న్యూస్, మర్దాని 2లకు పని చేశాడు. ఇంత భారీ ప్రొఫైల్ ఉంది కాబట్టే మెగా క్యాంప్ లోకి ప్రవేశించగలిగాడు. సోనీ సంస్థ నిర్మాణ భాగస్వామ్యానికి ముందుకొచ్చింది కూడా అందుకే. సూర్య చేసిన ఆకాశం నీ హద్దురా ఛాయలు కనిపిస్తున్నప్పటికీ ఇది పూర్తిగా దానికేమాత్రం సంబంధం లేని స్టోరీతో సాగుతుందట. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ కి సోలో హీరోగా చెప్పుకోదగ్గ సక్సెస్ పడలేదు. ఎఫ్3 హిట్టు కొట్టినా అందులో మేజర్ షేర్ వెంకటేష్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు చేయబోయేవి చాలా కీలకం.
This post was last modified on September 19, 2022 9:44 pm
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…