చాలా ఏళ్ల తర్వాత అయినా సరే.. తెలుగులో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల జాబితా తీస్తే అందులో సీతారామం మూవీకి కచ్చితంగా చోటు ఉంటుంది. హను రాఘవపూడి అంత గొప్పగా తీశాడు ఈ చిత్రాన్ని. చాలా సినిమాలు కాల క్రమంలో క్లాసిక్స్ అని, దృశ్యకావ్యం అని గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటాయి. కానీ సీతారామం మాత్రం తొలి రోజే క్లాసిక్ అయిపోయింది.
దృశ్యకావ్యంగా పేరు తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర కొంచెం డల్ నోట్‌తో మొదలైనప్పటికీ ఆ తర్వాత గొప్పగా పుంజుకుని లాంగ్ రన్‌తో కమర్షియల్‌గానూ పెద్ద విజయాన్నే అందుకుందీ చిత్రం. ఈ సినిమా తీసిన హను రాఘవపూడితో పాటు ప్రధాన పాత్రధారులు, టెక్నీషియన్లు, నిర్మాతలు.. ఇలా అందరికీ గొప్ప పేరు వచ్చింది. మరి ఈ కాంబినేషన్లో ఇంకో సినిమా వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన పులకింపజేసేదే.
ఐతే ఈ ఆలోచన త్వరలోనే కార్యరూపం దాల్చబోతున్నట్లు సమాచారం. హను దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ మరో సినిమాను నిర్మించబోతోందని.. ఇందులోనూ దుల్కర్, మృణాల్‌లే జంటగా నటిస్తారని తాజా సమాచారం. ఐతే ఇది సీతారామం చిత్రానికి సీక్వెల్ మాత్రం కాదట. ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని, మళ్లీ సీతారామం జంటతో సినిమా మాత్రం ఉంటుందని హను ఇంతకుముందే హింట్ ఇచ్చాడు.
ఇప్పుడు సీరియస్‌గానే ఆ ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీని గురించి ప్రకటన కూడా రాబోతోందట. ఐతే సీతారామంతో ప్రేక్షకులను అంతగా మైమరిచిపోయేలా చేసిన కాంబినేషన్లో ఇంకో సినిమా అంటే అంచనాలు భారీగా పెరిగిపోతాయి. ప్రతిదీ సీతారామంతో పోల్చి చూసి దానికి దీటుగా, ఇంకా గొప్పగా ఉండాలని ఆశిస్తారు. ఈ అంచనాలను అందుకోవడం అంత తేలికైతే కాదు.
This post was last modified on September 19, 2022 3:57 pm
ఒక హీరోయిన్ నటించిన రెండు సినిమాలు ఒకే టైంలో విడుదల కావడంలో ఆశ్చర్యం లేదు కానీ చాలా విషయాల్లో వాటి…
అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్.. తన హయాంలో దేశానికి స్వర్ణ యుగం తీసుకువస్తానని ప్రకటిం చారు.…
కెజిఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ కి చెట్టు కష్టాలు ఎక్కువయ్యాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవం. అదెలాగో…
ముఖ్యమంత్రిగా అనుభవంతో పాటు.. ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎలా నడిపించాలన్న దాని గురించి ఎవరికైనా సలహాలు.. సూచనలు ఇవ్వొచ్చు కానీ నారా…
ఉత్సాహం మంచిదే కానీ సమయం.. సందర్భం చూసుకోవాలి. అదేమీ లేకుండా కూటమి సర్కారుకు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా…
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ గా మంగళవారం తెల్లవారుజామున ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. బడా నిర్మాతగానే…