హీరో హీరోయిన్ల వెంట ఉండే బౌన్సర్లు కొన్నిసార్లు మీడియాతో, అభిమానులుతో హద్దులు దాటి ప్రవర్తించడం వివాదాస్పదం అవుతుంటుంది. వాళ్ల పని ఆ స్టార్లను ప్రొటెక్ట్ చేయడమే అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో అవసరం లేని హంగామా చేస్తూ.. మీడియా వాళ్లు, అభిమానుల మీద జులుం చూపిస్తుంటారు.
తమ అభిమాన తారలను చూడడానికి ఫ్యాన్స్, వారి ఫొటోలు, బైట్స్ తీసుకోవడానికి మీడియా వాళ్లు గంటలు గంటలు ఎదురు చూస్తుంటారు. అవకాశం వచ్చినపుడు కలవడానికి, ఫొటోలు తీయడానికి ప్రయత్నిస్తారు. ఆ మాత్రం అవకాశం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తించడం అన్యాయం. తాజాగా తమన్నా పాల్గొన్న హైదరాబాద్ ఈవెంట్లో ఇలాంటి వివాదమే చోటు చేసుకుంది.
తన కొత్త చిత్రం బబ్లీ బౌన్సర్ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన తమన్నా కోసం చాలా సేపు వెయిట్ చేసిన ఫొటోగ్రాఫర్లు తన పొటోలు తీయడానికి కాస్త సమయం అడిగారు. కానీ తమ షెడ్యూల్లో ఫొటో షూట్ లేదంటూ బౌన్సర్లు దౌర్జన్యానికి దిగారు. ఫొటోగ్రాఫర్ల మీద దాడి చేశారు. అసలు సింపుల్‌గా తేలిపోయే విషయానికి బౌన్సర్లు అంత అతి చేయాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్నలు తలెత్తాయి. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బౌన్సర్లు ఎందుకంత అతి చేశారో జనాలకు అర్థం కావట్లేదు. నిజానికి తమన్నాకు ఇప్పుడు బాగా డిమాండ్ తగ్గింది. మీడియా అవసరం ఆమెకే ఎక్కువ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆమె బౌన్సర్లు కావాలనే అతి చేశారేమో.. ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్కేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. బబ్లీ బౌన్సర్ ఒక లేడీ బౌన్సర్ కథతో తెరకెక్కిన చిత్రం. దీనికి పబ్లిసిటీ రావాలనే బౌన్సర్లు అతి చేసి.. ఆ వీడియో వైరల్ అయ్యేలా చేసి ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో.
This post was last modified on September 18, 2022 4:40 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…