Movie News

రష్మిక ఖాతాలో మరో క్రేజీ సీక్వెల్ ?

నార్త్ లోనూ పుష్ప 1 బ్లాక్ బస్టర్ కావడం రష్మిక మందన్నకు మాములుగా కలిసి రాలేదు. అందులో డీ గ్లామర్ మేకప్ తో నటించినా తన నటన అక్కడి వాళ్ళను కట్టిపడేసింది. ఇంకేముంది వరస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆల్రెడీ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూతురిగా నటించిన గుడ్ బై త్వరలోనే విడుదల కానుంది. ఆ నలుగురు తరహాలో మనిషి చనిపోయాక జరిగే పరిణామాల చుట్టూ అల్లిన మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం శ్రీవల్లిలో బలంగా కనిపిస్తోంది. ఇటీవలే రిలీజైన ట్రైలర్ చూస్తే రష్మికకు పెర్ఫార్మన్స్ పరంగా పెద్ద స్కోపే ఇచ్చారు.

ఇది కాకుండా సిద్దార్థ్ మల్హోత్రాకు జోడిగా చేసిన మిషన్ మజ్ను పూర్తి కావడానికి దగ్గరలో ఉంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ భారీ బడ్జెట్ తో తీశారు. బ్రహ్మాస్త్రతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న రన్బీర్ కపూర్ అనిమల్ కూడా తనకు క్రేజీ ప్రాజెక్టే. దర్శకుడు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా కాబట్టి క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. క్లిక్ అయితే వచ్చే గుర్తింపు మాములుగా ఉండదు. నెక్స్ట్ ఆషికీ 3లోనూ తన పేరు పరిశీలనలో ఉన్నట్టు ముంబై టాక్. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా దీన్ని తీయబోతున్నారు. ఇటీవలే ప్రకటించారు.

ఆషీకీ అంటే హిందీలో ఒక ల్యాండ్ మార్క్ లాంటిది. 1990లో మహేష్ భట్ తీసిన ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పాటలతో ప్రేక్షకులను వెర్రెత్తించడం అప్పట్లో కథలుగా చెప్పుకునే వారు. 2013లో మోహిత్ సూరి ఆషీకీ 2 సైతం దానికేమాత్రం తీసిపోని సెన్సేషన్. సాహో భామ శ్రద్ధ కపూర్ గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేసింది ఇదే. అలాంటి హిస్టరీ ఉన్న ఆషీకీకి ఇప్పుడు మూడో ఫ్రాంచైజ్ వస్తోందంటే అంచనాలు మాములుగా ఉండవుగా. ఒకవేళ రష్మికకు నిజంగా ఇది ఓకే అయితే మరో మైలురాయి చేరినట్టే. ఇతర ఆప్షన్లు దీపికా పదుకునే, అలియా భట్ పేర్లు లిస్టులో ఉన్నాయట

This post was last modified on September 18, 2022 6:35 am

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

7 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

9 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

9 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

9 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

13 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

13 hours ago