కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మాంచి గుర్తింపు సంపాదించాడు యశ్. ఐతే ఈ సినిమాతో వచ్చిన ఫాలోయింగ్, ఇమేజ్, మార్కెట్‌ను అతనెలా ఉపయోగించుకుంటాడన్న విషయంలో అందరికీ ఆసక్తి ఉంది. కన్నడలో ప్రశాంత్ నీల్ స్థాయి దర్శకులు తక్కువ.
వేరే దర్శకులు యశ్ ఇమేజ్‌కు తగ్గ సినిమాలు చేయగలరా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. కేజీఎఫ్-2 విడుదలై నెలలు గడుస్తున్నా అతను కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. కేజీఎఫ్-1, 2కు మధ్య వచ్చిన గ్యాప్‌లో కూడా అతను కొత్త సినిమాను ఓకే చేయలేకపోయాడు. యశ్ కొత్త చిత్రం గురించి రకరకాల ఊహాగానాలు వినిపంచాయి కానీ.. ఏదీ వాస్తవ రూపం దాల్చలేదు.
కాగా ఇప్పుడు యశ్ ఓ మెగా మూవీతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేయబోతున్నట్లు ప్రచారం జరగబోతోంది. తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో అతడి కొత్త సినిమా ఉంటుందట. ఈ చిత్రంలో నెట్ ఫ్లిక్స్ వాళ్లు భాగం కాబోతున్నారని.. అలాగే బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలైన ధర్మ ప్రొడక్షన్స్ (కరణ్ జోహార్), పెన్ మూవీస్ కూడా ఇందులో పార్ట్‌నర్స్ అని అంటున్నారు.
వందల కోట్ల బడ్జెట్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రణాళికలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం శంకర్ సమాంతరంగా ఇండియన్-2, రామ్ చరణ్ సినిమాలను షూట్ చేస్తున్నాడు. ఇవి రెండూ ఆరు నెలల్లో పూర్తవుతాయని.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో యశ్‌తో ఆయన కొత్త చిత్రం పట్టాలెక్కుతుందని ప్రచారం జరుగుతోంది.
This post was last modified on September 17, 2022 9:58 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…