Movie News

ఫ్లాప్ కాంబినేష‌న్లో కొత్త సినిమా

పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి వ‌చ్చిన యంగ్ హీరోలు చాలా వ‌ర‌కు మాస్ ఇమేజ్ కోసం వెంప‌ర్లాడ‌తారు. కానీ మెగా కుర్రాడు వ‌రుణ్ తేజ్ మాత్రం అలాంటి ప్ర‌య‌త్నం పెద్ద‌గా చేసింది లేదు. పెద్ద మాస్ హీరో అవ్వ‌డానికి త‌గ్గ క‌టౌట్ ఉన్న‌ప్ప‌టికీ.. కెరీర్లో చాలా వ‌ర‌కు క్లాస్ ట‌చ్ ఉన్న‌, ప్రయోగాత్మ‌క చిత్రాలే ఎక్కువ చేశాడు. అత‌ను చేసిన రిస్కీ ప్రాజెక్టుల్లో అంత‌రిక్షం ఒక‌టి.

ఘాజీ సినిమాతో ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటుకున్న సంక‌ల్ప్ రెడ్డితో అత‌ను చేసిన ఈ సినిమా అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. అయినా స‌రే.. ఆ ద‌ర్శ‌కుడిని న‌మ్మి మ‌రో సినిమా చేయ‌డానికి అత‌ను రెడీ అయ్యాడు. ఈ సినిమా గురించి తాజాగా హింట్ ఇచ్చారు.

వ‌రుణ్ 13వ సినిమాగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం గురించి ఈ నెల 19న అనౌన్స్‌మెంట్ రాబోతోంది. ఈ రోజు చిన్న టీజ‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇందులో ద‌ర్శ‌కుడు, ఇత‌ర వివ‌రాలేవీ వెల్ల‌డించ‌క‌పోయినా.. ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోయేది సంక‌ల్పేన‌ట‌. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. సంక‌ల్ప్ తొలి రెండు చిత్రాలు ఘాజీ, అంత‌రిక్షం త‌ర‌హాలోనే దీన్ని కూడా ఇది కూడా అడ్వెంచ‌ర‌స్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీనే అట‌. ఈ రోజు రిలీజ్ చేసిన టీజ‌ర్ కూడా ఆ సంకేతాలే ఇచ్చింది.

ఇందులో ఒక యుద్ధ విమానం బొమ్మ‌ను చూపించారు. దీన్ని బ‌ట్టి హీరో ఫైట‌ర్ జెట్ న‌డిపే పైల‌ట్ అయి ఉంటాడ‌ని అంచ‌నా వ‌స్తోంది. వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా తెరకెక్క‌నుండ‌డం విశేషం. కాబ‌ట్టి ఘాజీ త‌రహా ఇస‌నిమా అయి ఉండే అవ‌కాశ‌ముంది.

This post was last modified on September 17, 2022 2:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రంప్ గోల్డ్ కార్డ్.. టాలెంట్ ఉంటే సరిపోదు..

అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…

11 minutes ago

ఆ రాష్ట్రంలో 400 చిన్నారులకు HIV

హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…

34 minutes ago

ఆఖరి నిమిషంలో ఆగిపోయిన అన్నగారు

అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…

40 minutes ago

అఖండ 2: ఓవర్ టు బోయపాటి

భారీ అంచనాల మధ్య ఓ పెద్ద హీరో సినిమా రిలీజైందంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడే వేరు. ఐతే ఈ…

48 minutes ago

చిన్మయి vs ట్విట్టర్ యువత – ఆగేదెప్పుడు?

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న…

1 hour ago

సునీల్ వెనుక వైసీపీ రాజకీయ వర్గాల్లో చర్చ

వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న…

1 hour ago