టాలీవుడ్ యువ కథానాయకుల్లో కొంతమంది మంచి రైటర్లు కూడా ఉన్నారు. అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి వాళ్లు అందుకు ఉదాహరణ. శేష్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే రైటర్ కమ్ డైరెక్టర్‌గా అడుగు పెట్టాడు. కర్మ, కిస్ అనే చిత్రాలు తీశాడు. ఐతే అవి ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో నటనకు పరిమితం అయ్యాడు.
కొంత నిలదొక్కుకున్నాక మళ్లీ రైటింగ్ మీద దృష్టిపెట్టాడు. అలా అని అంతా తానై ఏమీ వ్యవహరించలేదు. రవికాంత్ పేరెపు, శశికిరణ్ తిక్క లాంటి విషయం, అభిరుచి ఉన్న దర్శకులతో కలిసి పని చేసి అద్భుతమైన సినిమాలు అందించాడు. రైటింగ్ విషయంలో శేష్ ఎంత కసరత్తు చేస్తాడన్నది అందరికీ తెలిసిందే. ఇక సిద్ధు జొన్నలగడ్డ సైతం గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీల, డీజే టిల్లు చిత్రాలతో తన రైటింగ్ టాలెంట్ ఏంటో చూపించాడు. అతను కూడా ఆషామాషీగా ఏమీ రాయడు. చాలా శ్రద్ధ పెడతాడు. కసరత్తు చేస్తాడు.
ఐతే వీళ్లను చూసి ఇన్‌స్పైర్ అయ్యాడో, లేక తన టాలెంట్ మీద నమ్మకమో కానీ.. మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సైతం వరుసగా తన సినిమాలకు రైటింగ్ బాధ్యత తీసుకుంటున్నడు. ఇంతకుముందు ఎస్ ఆర్ కళ్యాణమండపం.. ఇప్పుడు నేను మీకు బాగా కావాల్సిన వాడిని చిత్రాలకు కిరణే స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చాడు. ఐతే ఈ రెండు చిత్రాల్లో స్క్రీన్ ప్లేలో కానీ, డైలాగుల్లో కానీ ఎలాంటి మెరుపులు లేవు. ఎలా పడితే అలా సీన్లు పేర్చుకుంటూ పోయాడు. నోటికొచ్చి డైలాగ్ రాసేశాడు. ముఖ్యంగా లేటెస్ట్ రిలీజ్ నేను మీకు బాగా కావాల్సిన వాడిని అయితే మరీ పేలవమైన సినిమా. అసలు ఇలాంటి స్క్రిప్టుతో సినిమా తీయాలని ఎలా అనుకున్నారో అన్న ప్రశ్న రేకెత్తిస్తుందా చిత్రం.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా.. తొలి సినిమా రాజా వారు రాణి వారు థియేటర్లలో సరిగా ఆడకపోయినా.. ఓటీటీలోనే మంచి స్పందన తెచ్చుకుని కిరణ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీని వల్ల తర్వాతి సినిమాలకు క్రేజ్ వచ్చింది. ఇలా అనుకోకుండా వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకుని జాగ్రత్తగా అడుగులు వేయాల్సింది పోయి ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేస్తూ.. తనకు తాను ఏదో ఫీలైపోయి రైటర్ అవతారం ఎత్తేస్తూ కెరీర్‌ను చేజేతులా దెబ్బ తీసుకుటున్నాడు కిరణ్. అతడి కెరీర్ బాగు పడాలంటే ముందు రైటింగ్ జోలికి వెళ్లకపోవడం బెటర్ అన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల నుంచే కాక ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on September 17, 2022 2:58 pm
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…