శింబు హీరోగా గౌతం మీనన్ కాంబినేషన్ లో ‘వెందు తనింధతు కాదు ‘ అనే సినిమా వచ్చింది. తమిళ్ నాడులో సినిమా 15న రిలీజైంది. తెలుగులో ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ అనే టైటిల్ తో స్రవంతి మూవీస్ ద్వారా డబ్బింగ్ మూవీ గా రిలీజ్ అవుతుంది. తెలుగులో ఈ వీక్ మూడు సినిమాల రిలీజ్ కారణం చేత రెండు రోజులు ఆలస్యంగా రిలీజ్ అనుకున్నారు. తమిళ్ లో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాను చూసేందుకు తెలుగు ఆడియన్స్ ఇవ్వాళ టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ అనుకోకుండా మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయ్యాయి.
ఉదయం బుక్ చేసుకున్న అందరికీ షో క్యాన్సిల్ అనే మెసేజ్ రావడంతో మూవీ లవర్స్ షాక్ అయ్యారు. ఏమై ఉంటుంది ? థియేటర్ లో టికెట్స్ బుక్ అవ్వకపోవడం వల్ల క్యాన్సిల్ అయి ఉంటుందా ? అనుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో అన్ని షోస్ క్యాన్సిల్ అయ్యాయని కాసేపటికి తెలుసుకున్నారు. అయితే ఉన్నపళంగా షో క్యాన్సిల్ అంటే అందరూ ఫైనాన్స్ ఇష్యూ ఏమైనా వచ్చి ఉంటుందని అనుకుంటారు. కానీ స్రవంతి మూవీస్ కి తెలుగులో అలాంటి సమస్య ఉండదు. అసలు సంగతి వేరే ఉంది. ఈ సినిమాకు సెన్సార్ ఇబ్బంది వచ్చిందట.
సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యం కారణంగా మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయ్యాయని తెలుస్తుంది. అయితే కేవలం మార్నింగ్ షోలు మాత్రమే నిలిపివేశారు. మ్యాట్నీ షో నుండి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మేరకు స్రవంతి మూవీస్ నుండి ఓ ప్రకటన కూడా వెలువడింది. మధ్యాహ్నాం 2గంటల షో తో సినిమా థియేటర్స్ లోకి రానుంది. మరి తెలుగు స్టేట్స్ లో ఈ డబ్బింగ్ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
This post was last modified on September 17, 2022 1:29 pm
వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటించి కలకలం రేపారు కదా. ప్రకటించినట్లుగానే ఆయన తన…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదని వైసీపీ నేతలు…
ఏపీలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత.. రాష్ట్రానికి పోయిన పేరును తీసుకువచ్చేందుకు.. గత ప్రాభవం నిలబెట్టేందుకు కూటమి పార్టీలు…
అప్పుడెప్పుడో ఇంగ్లాండ్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టినట్టు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్నాం…
గేమ్ ఛేంజర్ ఫలితం తేలిపోవడంతో మెగాభిమానుల దృష్టి ఆర్సి 16 వైపుకు వెళ్తోంది. తాజాగా మూడో షెడ్యూల్ మొదలుపెట్టిన దర్శకుడు…
పరిటాల…ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. అటు రాజకీయంగా అయినా… ఇటు ఆయా ప్రాంతాలపై పట్టు…