ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియాలో బ్లాక్‌బస్టర్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్లే సినిమా ఉండడంతో అపూర్వ ఆదరణ దక్కింది. చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నా కూడా అవేమీ పెద్ద కంప్లైంట్లు కావు. ఇండియాలో ఈ చిత్రం దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టింది. విదేశాల్లో రూ.200 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు వచ్చాయి. మొత్తంగా రూ.1200 కోట్ల వసూళ్లతో ఔరా అనిపించింది ఆర్ఆర్ఆర్.
ఐతే సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోయాక నెట్ ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్‌కు వచ్చిన రెస్పాన్స్ అసాధారణం. హాలీవుడ్ ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్ ఈ సినిమాను గొప్పగా ఆదరించారు ఆడియన్స్. హాలీవుడ్ ఫిలిం మేకర్స్ సైతం ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. మళ్లీ యుఎస్‌లో స్పెషల్ షోలు వేస్తే అక్కడి ప్రేక్షకులు విరగబడి చూశారు.
ఈ స్పందన తనకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించినట్లు చెబుతున్నాడు రాజమౌళి. టొరంటో ఫిలిం ఫెస్టివల్‌కు అతిథిగా హాజరైన జక్కన్న అక్కడ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్‌కు వచ్చిన ఇంటర్నేషనల్ అప్లాజ్ గురించి చర్చించాడు. తనతో పాటు ఇండియన్ ఫిలిం మేకర్స్ అందరూ ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ ఉన్న ఇండియన్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లే సినిమాలు తీస్తామని.. ఐతే బాహుబలి సినిమా భారతీయులతో పాటు జపాన్ ఆడియన్స్‌ను గొప్పగా అలరించిందని.. ఐతే ఆర్ఆర్ఆర్ మాత్రం హాలీవుడ్ ప్రేక్షకులను ఆ స్థాయిలో మెప్పిస్తుందని తాను ఊహించాలేదని జక్కన్న చెప్పాడు.
మామూలుగా వెస్ట్ ప్రేక్షకుల అభిరుచి వేరు, మన సినిమాలు వాళ్లకు రుచించవు అనే అభిప్రాయంతో ఉండేవాడినని.. కానీ ఆర్ఆర్ఆర్‌ను వాళ్లు అంతగా ఆదరించడం చూసి మనం కూడా వాళ్ల అభిరుచికి తగ్గ సినిమా తీయగలం అని అర్థం చేసుకున్నానని.. ఈ విషయాన్ని మరింత స్టడీ చేస్తున్నానని జక్కన్న చెప్పాడు. జక్కన్న మాటల్ని బట్టి చూస్తే మహేష్‌బాబుతో చేయబోయే సినిమా పాన్ వరల్డ్ లెవెల్లోనే ఉంటుందని అర్థమవుతోంది.
This post was last modified on September 16, 2022 10:35 am
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…