Movie News

బిగ్ బాస్ 6 లైట్ తీసుకున్నారా

ఏ భాషలో మొదలుపెట్టినా వివాదాలు గొడవలతో నానా యాగీ చేసే బిగ్ బాస్ రియాలిటీ షో కొంత డల్ గా ఉండేది తెలుగులోనే. హిందీలో సల్మాన్ ఖాన్ పదమూడు సీజన్లు నడిపించినా అక్కడ ప్రతిసారి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో అదరగొడుతుంది. తమిళంలోనూ కమల్ హాసన్ యాంకరింగ్ తో ఇప్పటిదాకా తక్కువ రెస్పాన్స్ వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇక్కడ మాత్రం మొదట జూనియర్ ఎన్టీఆర్ తో మొదలుపెట్టి ఆ తర్వాత నానికి ఇచ్చి ఫైనల్ గా నాగార్జునకు పగ్గాలు ఇవ్వడం దాకా ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. మధ్యలో టిఆర్పి తగ్గినా బిగినింగ్ అండ్ కంక్లూజన్ మాత్రం అదిరిపోతాయి.

ఇటీవలే బిగ్ బాస్ 6 మొదలైన సంగతి తెలిసిందే. కానీ గతంలో ఉన్నంత ఊపు, సోషల్ మీడియాలో దీని గురించి చర్చ పెద్దగా కనిపించడం లేదు. పైగా ఓపెనింగ్ ఎపిసోడ్ కు 9 మించి టిఆర్పి రేటింగ్ రాలేదని టీవీ వర్గాల కథనం. ఇది నిజమో కాదో పక్కన పెడితే ఇంతకు ముందున్న ఎగ్జైట్ మెంట్ మాత్రం ప్రేక్షకుల్లో తగ్గిందనే చెప్పాలి. ఎన్నడూ లేనిది ఈసారి ఏకంగా 21 పార్టిసిపెంట్స్ ని తీసుకున్నారు. అయినా కూడా ఏమంత జోష్ అనిపించలేదు ఎక్కువగా బయట ప్రపంచానికి తెలియకుండా ఫేస్ బుక్, ఇన్స్ టాలో పాపులర్ అయినవాళ్లను తీసుకోవడం ఎఫెక్ట్ ఇచ్చింది.

ఇంకా రెండు వారాలు పూర్తిగా గడవలేదు కాబట్టి ఇంకో తొంబై రోజులకు పైగా సాగే షోలో చాలా అంటే చాలానే చేయొచ్చు. గతంలో కంటే ఈసారి మసాలా ఎక్కువుంటుందనే ప్రచారం జరిగింది కానీ అదింకా మొదలైతే కాలేదు. ఆ మధ్య ఓటిటిలో ఒక ఎక్స్ క్లూజివ్ సీజన్ చేయడం, తక్కువ గ్యాప్ లో ఇప్పుడు టీవీది మొదలుపెట్టడం లాంటి కారణాలు ఉన్నాయి కానీ అసలైన కిక్ షురూ చేయాలి. నాగార్జున ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో తమ సినిమా ప్రమోషన్ల కోసం స్టార్లు సెలబ్రిటీలు వస్తారు. బ్రహ్మాస్త్ర బోణీ చేసేసింది. తర్వాత ఘోస్ట్ టీమ్ తో పాటు ఇంకెవరెవరు రానున్నారో.

This post was last modified on September 16, 2022 6:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

4 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago