లైగర్ ఇచ్చిన డిజాస్టర్ షాక్ నుంచి మెల్లగా కోలుకుంటున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫోకస్ మొత్తం ఖుషీ మీదే పెడుతున్నాడు. మీడియాకు దొరకడం లేదు కానీ ఈ మధ్య జరిగిన సైమా అవార్డుల వేడుకలో జనగణమనకు సంబంధించిన ప్రశ్నను చాలా స్మార్ట్ గా తప్పించుకున్నాడు. ఖుషీ రిలీజ్ నెలల క్రితమే డిసెంబర్ 23 అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడది వాయిదా పడొచ్చని వినికిడి. వ్యక్తిగత కారణాల వల్ల సమంతా ప్రస్తుతం ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ కి హాజరు కాలేనని చెప్పిందట. సో అనుకున్న టైంకి పూర్తి కాకపోవచ్చు.
ఈ లెక్కన డెడ్ లైన్ మీట్ అవ్వడం కష్టం. వరస ఫ్లాపులతో తన మార్కెట్ కే ముప్పు తెచ్చుకున్న విజయ్ కి ఖుషీ బ్లాక్ బస్టర్ కావడం చాలా అవసరం. అసలే పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ టైటిల్ ని వాడుకున్నాడు. ఏ మాత్రం తేడా వచ్చిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆడుకుంటారు. ఈ అనుభవం చిరు పేరుని తీసుకున్న నానికి గ్యాంగ్ లీడర్ తో అనుభవమే. కంప్లీట్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఖుషీలో విజయ్ సామ్ ల కెమిస్ట్రీని చాలా కొత్తగా చూపిస్తున్నారట. దర్శకుడు శివ నిర్వాణ మరోసారి తన పొయెటిక్ టచ్ చూపించబోతున్నాడని టాక్.
నిన్ను కోరి, మజిలీ బ్యాక్ టు బ్యాక్ హిట్ల తర్వాత శివ నిర్వాణకు టక్ జగదీష్ పెద్ద షాకే ఇచ్చింది. డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కాబట్టి సరిపోయింది కానీ థియేటర్ అయ్యుంటే విమర్శలు ఇంకా ఎక్కువ వచ్చేవి. ఇక ఖుషి లాక్ చేసుకున్న స్లాట్ లోనే అఖిల్ ఏజెంట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ తను వస్తానంటే ఖుషికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పైగా అదే టైంలో అవతార్ 2, రణ్వీర్ సింగ్ సర్కస్ లు భారీ రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నాయి. మొత్తానికి ఏ రకంగా చూసినా ఖుషీ 2023 ఫిబ్రవరికో లేదా వేసవికో వెళ్లడం సేఫ్ గేమ్ అవుతుంది. చూడాలి మరి మేకర్స్ మనసులో ఏముందో.
This post was last modified on September 15, 2022 10:09 pm
పండక్కు రిలీజై హిట్టు కొట్టిన రెండు సినిమాల్లో చైల్డ్ ఎలిమెంట్ కీలక పాత్ర పోషించడాన్ని కొట్టిపారేయలేం. ముందుగా డాకు మహారాజ్…
తెలుగు సినీ పరిశ్రమ ఈ రోజు హైదరాబాద్లో ఎంత పెద్ద స్థాయిలో నిలబడుతోందో తెలిసిందే. ఇండియాలోనే అతి పెద్ద ఇండస్ట్రీల్లో…
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పెర్ఫార్మన్స్ పరంగా వెంకటేష్ తర్వాత ఎక్కువ స్కోప్ దొరికింది ఐశ్యర్య రాజేష్ కే. గ్లామర్ పరంగా…
గత ఏడాది ‘కల్కి: 2898 ఏడీ’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్కు అతి…
ఎప్పుడో 2012లో మొదలైన తమిళ సినిమా.. మద గజ రాజా. కొన్ని కారణాల వల్ల మేకింగ్లో ఆలస్యం జరిగి.. 2013…
ఏపీ రాజధాని అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు పండగ పూట భారీ కానుక అందించారు. గత ఏడాదిన్నరగా నిలిచి పోయిన…