సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో నిర్మాతలు కనీసం రెండు మూడు నెలల ముందే అడ్వాన్స్ గా లాక్ చేసుకుంటే తప్ప కోరుకున్న సంఖ్యలో థియేటర్లు దొరకని పరిస్థితి నెలకొంది. అలా అని మనం ఫలానా తేదీకి వస్తున్నామని ముందే చెబితే ఇంకెవరూ రారన్న గ్యారెంటీ లేదు కానీ కనీసం ఫస్ట్ చెప్పారు కదానే గౌరవంతో లేదా భయంతో రాజీ పడే ప్రొడ్యూసర్లు ఉండకపోరు. డిసెంబర్ మొదటి వారానికి ఇప్పటిదాకా ఎవరూ కర్చీఫ్ వేసుకోలేదు. ఇవాళ అడవి శేష్ హిట్ 2 ది సెకండ్ కేస్ ని ఏడాది చివరి నెల 2న విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్ అప్డేట్ ఇచ్చేశారు.
నిజానికి ఆ స్లాట్ లో బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబో మూవీ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టే షూటింగ్ జరుగుతోంది కానీ 2023 సంక్రాంతి రేస్ లో దిగితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా జరుగుతోంది. ఒకవేళ ఆది పురుష్, వారసుడు, వాల్తేర్ వీరయ్యలు కనక ఆ సీజన్ ని లాక్ చేసుకుంటే బాలయ్యకు థియేటర్ల పరంగా కొంత చిక్కు ఏర్పడుతుంది. దానికంటే ఒకనెల ముందే వచ్చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అఖండకు అలా చేయడం చాలా కలిసి వచ్చింది. వారాలపాటు ఎలాంటి పోటీ లేకుండా బ్రహ్మాండమైన కలెక్షన్లు రాబట్టుకుంది.
ఇక శేష్ హిట్ 2 సంగతి చూస్తే మేజర్ ప్యాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఇకపై అతను చేయబోయే అన్ని సినిమాలు మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కు విశ్వక్ సేన్ నటించిన ఫస్ట్ పార్ట్ కు ఎలాంటి సంబంధం ఉండబోవడం లేదు. మేజర్ తెచ్చిన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని త్వరలో మొదలుపెట్టనున్న కొత్త షెడ్యూల్ లో కొన్ని కీలక మార్పులు చేస్తారని ఇన్ సైడ్ టాక్. ఒకవేళ ఫస్ట్ వీక్ వద్దనుకుంటే మూడో వారానికి వాయిదా పడే ఛాన్స్ ఉంది.
This post was last modified on September 15, 2022 10:03 pm
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…