Movie News

సుధీర్ వ‌ద్దంటే నాగ్ చేశాడా?

ద‌క్షిణాది నుంచి హిందీలో అత్య‌ధిక చిత్రాలు చేసిన ఘ‌న‌త అక్కినేని నాగార్జున‌కే ద‌క్కుతుంది. శివ హిందీ వెర్ష‌న్‌తో పాటు ఆయ‌న చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లోనే సినిమాలు చేశాడు. ఆయ‌న అక్క‌డ చేసిన సినిమాల్లో చాలా వ‌ర‌కు మ‌ల్టీస్టార‌ర్లే. వాటిలో నాగ్‌కు కీల‌క పాత్ర‌లే ద‌క్కాయి. ఐతే 90ల్లో వ‌రుస‌గా హిందీ సినిమాలు చేసిన నాగ్.. ఆ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ త‌ర్వాత బ్ర‌హ్మాస్త్ర అనే భారీ చిత్రంలో అనీష్ అనే కీల‌క పాత్ర‌లో మెరిశాడు. ఈ పాత్ర నిడివి త‌క్కువే అయిన‌ప్ప‌టికీ.. అది ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంది. క‌థ‌లో ఆ పాత్ర చాలా కీల‌కంగానే క‌నిపించింది.

ఈ సినిమాకు, త‌న పాత్ర‌కు వ‌చ్చిన రెస్పాన్స్ ప‌ట్ల నాగ్ చాలా హ్యాపీగానే ఉన్నాడు. ఐతే ఈ పాత్ర కోసం నేరుగా నాగార్జున‌నే అడిగారా అనే విష‌యంలో ఇప్పుడు సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇందుకు కార‌ణం యువ క‌థానాయ‌కుడు సుధీర్ బాబు చేసిన వ్యాఖ్య‌లే.

త‌న కొత్త చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మీడియాను క‌లిసిన సుధీర్ బాబు.. బాలీవుడ్లో మ‌ళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారు అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ బ్ర‌హ్మాస్త్ర సినిమాలో ఒక పాత్ర కోసం త‌న‌ను అడ‌గ్గా, తెలుగులో తీరిక లేకుండా సినిమాలు చేస్తుండ‌డం వ‌ల్ల ఆ ఆఫ‌ర్‌ను రిజెక్ట్ చేసిన‌ట్లు వెల్ల‌డించ‌డం విశేషం.

సుధీర్‌కు ఏ పాత్ర ఆఫ‌ర్ చేసి ఉంటార‌ని ఆలోచిస్తే నాగ్ చేసిన అనీష్ క్యారెక్ట‌రే గుర్తుకొస్తుంది. అది కాకుండా అత‌డికి సూట‌య్యే క్యారెక్ట‌ర్ క‌నిపించ‌దు. అమితాబ్ చేసిన గురువు పాత్ర‌కైతే అత‌ను సూట్ కాడు. ఇక విల‌న్ బ్యాచులో క‌నిపించే ఛోటా రౌడీల పాత్ర‌ల‌కు అత‌ణ్ని అడిగే అవ‌కాశం లేదు. ఆల్రెడీ బాగీ లాంటి భారీ చిత్రంలో న‌టించిన అత‌డిని చిన్న పాత్ర‌ల‌కు అడిగి ఉండ‌రు. మ‌రి సుధీర్ చెబుతున్నది నిజ‌మే అయితే.. నాగ్ చేసిన క్యారెక్ట‌రే అత‌డికి ఆఫ‌ర్ చేసి ఉండొచ్చ‌ని, అత‌ను కాద‌న్నాకే నాగ్ ఓకే చేసి ఉండొచ్చ‌ని అనిపిస్తోంది.

This post was last modified on September 15, 2022 9:47 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

5 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago