Movie News

తెలుగులోకి ఇంకో నాలుగు కొరియ‌న్ రీమేక్స్

అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌రిమిత బ‌డ్జెట్లో గొప్ప క్వాలిటీతో సినిమాలు తీసే ఫిలిం ఇండ‌స్ట్రీ ఏది అంటే.. ఎక్కువ‌మంది కొరియ‌న్ సినిమాల గురించే చెబుతారు. ముఖ్యంగా థ్రిల్ల‌ర్ సినిమాలు తీయ‌డంలో కొరియ‌న్ ఫిలిం మేక‌ర్స్ నైపుణ్య‌మే వేరు. అలా అని హాలీవుడ్లో మాదిరి వంద‌ల కోట్ల బ‌డ్జెట్లు పెట్టేయ‌రు.

మ‌న సినిమాల స్థాయిలోనే, ఇంకా త‌క్కువ ఖ‌ర్చుతోనే ప్ర‌పంచ స్థాయి సినిమాలు తీస్తుంటారు. కొరియ‌న్ సినిమాలు మ‌న ద‌గ్గ‌ర చాలానే ఫ్రీమేక్ అయ్యాయి. రైడ్, పిల్ల జ‌మీందార్, కుర్రాడు స‌హా చాలా సినిమా కొరియ‌న్ సినిమాల‌కు కాపీలే. ఐతే ఒక‌ప్పుడంటే సీడీ సంపాదించి సైలెంటుగా కాపీ కొట్టేసేవారు. జ‌నాల‌కు కూడా విష‌యం తెలిసేది కాదు. కాపీ రైట్ ప్రాబ్లం కూడా పెద్ద‌గా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. ఏ చిన్న సీన్ కాపీ కొట్టినా జ‌నం ప‌ట్టేస్తున్నారు. ఒరిజిన‌ల్ మేక‌ర్స్‌కు తెలిసిపోతోంది. కేసులు వేసే ప‌రిస్థితి కూడా త‌లెత్తుతోంది.

అందుకే అధికారికంగా హ‌క్కులు కొని, ఇది ఫ‌లానా కొరియ‌న్ చిత్రానికి రీమేక్ అని చెప్పి సినిమా తీస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి గురు ఫిలిమ్స్ అధినేత సునీత తాటి నిర్మించిన ఓ బేబీ.. మిస్ గ్రానీ అనే కొరియ‌న్ మూవీకి అఫీషియ‌ల్ రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. అది మంచి ఫ‌లితాన్నందుకోవ‌డంతో ఇంకో అయిదు కొరియ‌న్ సినిమాల హ‌క్కులు కొనేశార‌ట‌.

ఓ బేబీతో క‌లిపితే మొత్తం లెక్క ఆరు. రెండో రీమేక్‌గా శాకిని డాకిని వ‌స్తోంది. ఇది మిడ్ నైట్ ర‌న్న‌ర్స్ అనే చిత్రానికి రీమేక్. ఒరిజిన‌ల్లో ఇద్ద‌రు హీరోలు న‌టిస్తే.. ఇక్క‌డ ఆ పాత్ర‌ల‌ను హీరోయిన్లుగా మార్చి తీశారు. ఇంకో నాలుగు రీమేక్స్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంద‌ని, అందులో ఒక‌టి స‌మంత‌తో ఉంటుంద‌ని సునీత తాటి మీడియాకు తెలిపింది. మంచి క్వాలిటీ, విభిన్న‌మైన క‌థాంశాల‌తో తెర‌కెక్కే కొరియ‌న్ సినిమాల హ‌క్కులు త‌క్కువ మొత్తానికే ద‌క్కుతుండ‌డంతో వాటిని రీమేక్ చేయ‌డం లాభ‌సాటిగానే అనిపిస్తున్న‌ట్లుంది.

This post was last modified on September 15, 2022 2:22 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

8 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

10 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

11 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

11 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

14 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

14 hours ago