ఇండియాలో న్యూడ్ ఫొటో షూట్లు వివాదస్పదం కావడం కొత్తేమీ కాదు. ఒక పత్రికలో ప్రచురితం అయిన తన న్యూడ్ షూట్ తాలూకు ఫొటో నటుడు, మోడల్ మిలింద్ సోమన్‌ను ఎంతగా ఇబ్బంది పెట్టిందో తెలిసిందే. దానికి సంబంధించిన కేసు 25 ఏళ్ల పాటు అతణ్ని వెంటాడడం గమనార్హం.
ఐతే ఈ రోజుల్లో న్యూడ్ ఫొటో షూట్‌ను ఎవరు పట్టించుకుంటారులే అనుకుంటాం కానీ.. ఇండియాలో న్యూడిటీకి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలున్న నేపథ్యంలో ఎవరైనా పట్టించుకుని కేసులు వేస్తే వాటి నుంచి బయటికి రావడం అంత తేలిక కాదు. ఈ విషయం బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌కు ఇప్పుడు బాగానే అర్థమవుతున్నట్లుంది. ఇటీవల అతను చేసిన న్యూడ్ ఫొటో షూట్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఐతే ఇవి కొందరి మనోభావాలను దెబ్బ తీశాయి. దీని మీద కేసులు వేశారు. కోర్టుకు వెళ్లారు.
వ్యవహారం సీరియస్ అయింది. కేసు రణ్వీర్ మెడకు చుట్టుకుంది. దీన్నుంచి బయటపడడానికి రణ్వీర్ చేస్తున్న ప్రయత్నంతో సోషల్ మీడియాకు దొరికిపోయి కామెడీ అయిపోతున్నాడు. ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ముంబయి పోలీసులు తాజాగా రణ్వీర్ స్టేట్మెంట్‌ను రికార్డ్ చేశారు. మీడియాలో ప్రచారంలోకి వచ్చిన తన న్యూడ్ ఫొటోలు ఒరిజినల్ కావని.. తన ఫొటోలను ఎవరో మార్ఫ్ చేసి న్యూడ్‌గా మార్చి వైరల్ చేశారని రణ్వీర్ స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. ఐతే వాస్తవం ఏంటన్నది అందరికీ తెలుసు.
తన ఫొటో షూట్ ఇంత వివాదాస్పదం అవుతుందని రణ్వీర్ ఊహించి ఉండకపోవచ్చు. కేసు మెడకు చుట్టుకోవడంతో బయట పడే మార్గం లేక రణ్వీర్ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడని అర్థమవుతోంది. కానీ సోషల్ మీడియా జనాలు ఊరుకుంటారా? రణ్వీర్ చేసే అతి వల్ల ట్రోలర్స్ కాచుకుని ఉంటారు. ఇప్పుడు వారికి అతను అడ్డంగా దొరికిపోయాడు. రణ్వీర్ ఆఫ్ ద స్క్రీన్ కూడా కూడా గొప్ప నటుడు, పెర్ఫామర్ అంటూ అతణ్ని ఒక రేంజిలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on September 15, 2022 2:21 pm
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…