రామ్ గోపాల్ వర్మ గురించి ఎవరేమనుకున్నా.. ఎంత తిట్టుకున్నా.. విమర్శలు గుప్పించినా.. ఆయన వైభవానికి ఏమాత్రం లోటు లేనట్లు ఉంటుంది వ్యవహారం. ఏమాత్రం ఖాళీ లేకుండా సినిమాలు తీసుకుంటూ పోతుంటాడు. ఆ సినిమాల క్వాలిటీ ఎలాగైనా ఉండనీ.. ఏదో ఒక గిమ్మిక్కు చేసి డబ్బులు చేసుకుంటాడు. తనకు నచ్చిన విధంగా లైఫ్ లీడ్ చేస్తూ.. తన వైభవానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేస్తూ నెటిజన్లను కవ్విస్తూ ఉంటాడు వర్మ. అందమైన అమ్మాయిల్ని పట్టుకుని వాళ్లను తన సినిమాల ద్వారా వెలుగులోకి తేవడంలో సిద్ధహస్తుడైన వర్మ.. ఎప్పటికప్పుడు కొత్త అందాల్ని పరిచయం చేస్తుంటాడు. ఇంతకుముందైతే వర్మ స్థాయి వేరు.. ఆయనతో సినిమా చేయడానికి కొత్తమ్మాయిలు తహతహలాడటంలో ఆశ్చర్యం లేదు.
కానీ ఫిలిం మేకర్‌గా పాతాళానికి పడిపోయినా సరే.. ఆయనకు అమ్మాయిలు దొరుకుతూనే ఉన్నారు. తాజాగా వర్మ.. అప్సరా రాణి అనే కొత్తమ్మాయిని వెతికి పట్టాడు. ఈ అమ్మాయిది ఒరిస్సా అట. అప్పుడెప్పుడూ ఒరిస్సాలో తుపాను వచ్చినపుడు మాత్రమే ఆ రాష్ట్రం గురించి తనకు తెలిసిందని.. ఇప్పుడు అప్సరా పుణ్యమా అని మళ్లీ ఒరిస్సా గురించి తెలుసుకున్నానని చెప్పిన వర్మ.. ఈ అమ్మాయితో థ్రిల్లర్ అనే సినిమా తీస్తున్నట్లు చెప్పాడు. తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో తర్వాతి సినిమా ఇదేనని కూడా ప్రకటించాడు. అప్సరతో కలిసి డిన్నర్ చేస్తూ.. తనతో సరసాలాడుతూ కొన్ని ఫొటోలు వర్మ షేర్ చేశాడు. అవి చూసి కుర్రాళ్లకు కళ్లు కుడుతున్నాయి. మరోవైపు అప్సర అందాల్ని ఎలివేట్ చేసే హాట్ ఫొటోలు కూడా కొన్ని వర్మ షేర్ చేశాడు. అవి కుర్రాళ్లకు కిక్కిస్తున్నాయి.
This post was last modified on July 6, 2020 8:04 pm
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్‌కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…