అదేంటి ఇంకా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ సి 15 తాలూకు అప్డేట్సే సరిగా రావడం లేదు అప్పుడే పదహారో సినిమా లీకులేంటా అన్ని ఆశ్చర్యపోకండి. విషయం గట్టిగానే ఉంది.
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయాల్సిన ఈ ప్రాజెక్ట్ క్యాన్సిలయ్యిందనే వార్త గత మూడు రోజుల నుంచి తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని ఖండిస్తూ అటు ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ ఇటు డైరెక్టర్ నుంచి కానీ ఎలాంటి ప్రకటన, ట్వీటు లేకపోవడంతో అభిమానులు నిజమే అనుకుంటున్నారు. ఇంకొద్ది రోజులు ఇలాగే మౌనంగా ఉంటే ఆపేశారని కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా ఇప్పుడా స్థానంలో కన్నడ దర్శకుడు నర్తన్ వచ్చి చేరాడనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. హీరో పాత్ర డాక్టర్ గా ఒక పవర్ ఫుల్ యాక్షన్ సబ్జెక్టుని చరణ్ కు చెప్పాడట. లైన్ నచ్చడంతో ఫుల్ వెర్షన్ అయ్యాక నిర్ణయం తీసుకుందామని రామ్ చరణ్ అన్నట్టు వినికిడి.
కలిసిన మాట నిజమే కానీ సబ్జెక్టు వినిపించాడా లేదా అనేది మాత్రం ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. టి సిరీస్ నిర్మాణ భాగస్వామ్యంలో మరో టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తారని మరో న్యూస్. కెజిఎఫ్-సలార్ కు టెర్రిఫిక్ మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్ ని సంగీత దర్శకుడిగా లాక్ చేస్తారట.
ఇవన్నీ చాలా ముందుగా వస్తున్న ఊహాగానాలే అయినప్పటికీ నిప్పు లేనిదే పొగరాదు తరహాలో ఫ్యాన్స్ మధ్య ఈ టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ ఆషామాషీ సినిమాలు చేస్తే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఆచార్యతో అర్థమయ్యింది. అందుకే ఆచితూచి అడుగులు వేయడంలో భాగంగానే గౌతమ్ తో వద్దనుకున్నాడనే టాక్ ఉంది. ఇవన్నీ తర్వాత తేలుతాయి కానీ ఇంతకీ శంకర్ తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ తాలూకు టైటిలో ఫస్ట్ లుక్ పోస్టరో ఏదో ఒకటి వదలమంటున్న అభిమానుల డిమాండ్ మాత్రం నెలలు గడిచే కొద్దీ నెరవేరడం లేదు. షూటింగ్ మాత్రం చకచకా సాగిపోతోంది
This post was last modified on September 15, 2022 6:18 am
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…