ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేదు. అందులో గ్రాఫిక్స్ విషయంలో విమర్శలొచ్చాయి. మిగతా ప్రోమోలు కూడా అంతంతమాత్రమే. ఇవన్నీ చాలవన్నట్లు బాయ్‌కాట్ బ్యాచ్ తలపోటు ఒకటి. ఇన్ని ప్రతికూలతలను దాటుకుని బ్రహ్మాస్త్ర మూవీ బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు, తొలి వీకెండ్లో అద్భుతమే చేసింది. దేశవ్యాప్తంగా హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది. రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ తెచ్చుకుంది.
హిందీలో పెద్ద పెద్ద స్టార్లు నటించిన సినిమాలకు టాక్‌తో సంబంధం లేకుండా మరీ తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తున్న రోజుల్లో తొలి వీకెండ్లో రూ.210 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. డివైడ్ టాక్‌ను తట్టుకుని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడ్డట్లే కనిపించింది. దీంతో సినిమాను నమ్ముకున్న అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఐతే బ్రహ్మాస్త్ర బడ్జెట్, బిజినెస్ ప్రకారం చూస్తే ఈ చిత్రం వీకెండ్ వరకు జోరు చూపిస్తే సరిపోదు. సినిమాకు లాంగ్ రన్ అవసరం. కానీ బ్రహ్మాస్త్ర వీకెండ్ తర్వాత నిలబడలేకపోయింది. సోమవారం ఒక్కసారిగా 60 శాతం దాకా వసూళ్లు పడిపోయాయి. మంగళవారం కలెక్షన్లు ఇంకా తగ్గాయి. ఈ రెండు రోజుల్లో కలిపి సినిమా వరల్డ్ వైడ్ 25 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ రాబట్టింది.
తొలి వీకెండ్లో రోజుకు 60 కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లు రాబట్టిన సినిమా వీకెండ్ అయ్యాక రెండు రోజులకు కలిపి 25 కోట్లే వసూలు చేయడం అంటే సినిమా బోల్తా కొట్టిందనే చెప్పాలి. తొలి వీకెండ్లో అంత జోరు చూపించినా రికవరీ 40 శాతం లోపే ఉంది. అంటే సినిమా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఫుల్ రన్లో రూ.600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే ఇది బ్రేక్ ఈవెన్ అవుతుంది. కానీ వీక్ డేస్‌లో సినిమా బాగా వీక్ అయిపోవడంతో అంతిమంగా బ్రహ్మాస్త్ర పెద్ద డిజాస్టరే అయ్యేలా ఉంది.
This post was last modified on September 14, 2022 9:17 pm
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…