Movie Reviews: సినిమా రివ్యూల పట్ల ఇండస్ట్రీ జనాల నుంచి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. కొందరు రివ్యూలు అవసరం అంటారు. వాటి పట్ల సానుకూలంగా మాట్లాడతారు.
కొందరేమో రివ్యూలు సినిమాలకు చేటు చేస్తున్నాయని.. సినిమాలు బాలేనపుడు వేగంగా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయి వసూళ్లు పడిపోవడానికి రివ్యూలు కారణమవుతున్నాయని అసహనం వ్యక్తం చేస్తుంటారు. కానీ మంచి సినిమాలకు రివ్యూలు చాలా లాభం చేకూరుస్తాయన్నది కూడా వాస్తవమే.
సినిమా బాగుంటే రివ్యూల వల్ల ప్రయోజనమే తప్ప నష్టమైతే లేదు. ఈ ఇంటర్నెట్ రివ్యూలను నివారించడం సాధ్యం కాని పని. వాటి పట్ల వ్యతిరేకత చూపించడంలో కూడా అర్థం లేదు. సినిమా వాళ్లయినా సరే.. వేరే సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలంటే రివ్యూల మీద ఆధారపడతారనడంలో సందేహం లేదు.
ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోకపోవచ్చు కానీ.. సీనియర్ హీరో అక్కినేని నాగార్జున మాత్రం ఓపెన్ అయ్యారు. తాను కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలనుకున్నపుడు రివ్యూల మీద ఆధారపడతానని నాగ్ (Nagarjuna) తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
రివ్యూల పరిణామ క్రమం గురించి ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు సినిమా సమీక్షలు వారం తర్వాత పత్రికలు, మ్యాగజైన్లలో వచ్చేవి. అప్పటికి సినిమా ఉందో లేదో కూడా చాలామందికి తెలిసేది కాదు. అప్పుడు ఆ రివ్యూలను పెద్దగా పట్టించుకునేవారు కూడా కాదు.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సోషల్ మీడియా, అలాగే వెబ్ సైట్లు పెరిగాక రివ్యూలకు డిమాండ్ పెరిగింది. సినిమా టాక్‌లో రివ్యూలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. నేను కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలంటే ముందు ఐఎండీబీ రేటింగ్స్ చూస్తా. కనీసం వెయ్యి రివ్యూలు, 7కు పైగా రేటింగ్ ఉంటేనే ఆ సినిమా లేదా సిరీస్ చూస్తా. లేదంటే టైం వేస్ట్ కదా అని నాగ్ వివరించాడు.
This post was last modified on September 15, 2022 6:17 am
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…