అర్జున్ సురవరం తర్వాత అనుకోకుండా రెండేళ్ల బ్రేక్ వచ్చిన నిఖిల్ కు కార్తికేయ 2 ఇచ్చిన బ్లాక్ బస్టర్ కిక్ మాములుగా లేదు. తెలుగులో హిట్టు కొడితే చాలనుకుంటే ఏకంగా హిందీలోనూ అంతకు మించి ఘనవిజయం సాధించడం, అక్కడా తనకు గుర్తింపు రావడం చిన్న విషయం కాదు. ఈ ప్రభావం ఎంతగా ఉందంటే ఈ సినిమా మొదటి భాగంలో కథకు ప్రారంభం ఉందేమోనని యూట్యూబ్ లో ఉన్న దాని డబ్బింగ్ వెర్షన్ ఏజ్ అజీబ్ దాస్తాన్ శాపిత్ ని ఎగబడి చూసేస్తున్నారు. ఆరు నెలల క్రితం పెడితే ఇప్పుడది 8 మిలియన్ల వ్యూస్ కు దగ్గరలో ఉంది.
ఇప్పుడీ ఫలితం నిఖిల్ చేయబోతున్న నెక్స్ట్ సినిమాలు 18 పేజెస్, స్పైల మీద బలంగా ఉంది. సుకుమార్ రచనలో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఎయిటీన్ పేజెస్ లోనూ అనుపమ పరమేశ్వరనే హీరోయిన్. అయితే ఇప్పుడు కొన్ని కీలక మార్పులు చేసుకుని కొంత భాగం రీ షూట్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఎప్పుడో పూర్తయిన ఫైనల్ కట్ ని సుక్కు చూసి పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయకపోవడంతో అవసరమైన మేరకు మళ్ళీ తీసేందుకు నిఖిల్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట.
కార్తికేయ 2 సక్సెస్ ని కాపాడుకోవడం నిఖిల్ కు చాలా అవసరం. అయితే ఇప్పటిదాకా దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ బయటికి ఇవ్వడం లేదు. కనీసం ట్రైలర్ ఫలానా టైంలో వస్తుందన్న క్లూస్ కూడా లేవు. నిఖిల్ సైతం ఇంటర్వ్యూలలో ఎంతసేపూ రీసెంట్ హిట్టు గురించి మాట్లాడాడు తప్ప 18 పేజెస్ ప్రస్తావన వీలైనంత రాకుండా చూసుకున్నాడు. ఒకవేళ ఈ వార్త నిజమైతే రిలీజ్ కు కొంత టైం పట్టొచ్చు. అసలే బన్నీ వాస్ నిర్మాణంలో వస్తున్న చిత్రాలు తేడా కొడుతున్నాయి. చావు కబురు చల్లగా, పక్కా కమర్షియల్ లాంటివి షాక్ ఇచ్చాయి. అందుకే 18 పేజెస్ విషయంలో జాగ్రత్త పడుతున్నారేమో.
This post was last modified on September 15, 2022 6:19 am
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…