టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్‌కు గొప్ప ఊరటనిచ్చిన సినిమా ఒకే ఒక జీవితం. వరుసగా ఆరు పరాజయాల తర్వాత ఈ చిత్రం అతడికి ఉపశమనాన్నిచ్చింది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజవడం వల్ల పెద్దగా ఓపెనింగ్స్ రాలేదు కానీ.. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు సాయంత్రం నుంచే సినిమా పుంజుకుంది. శని, ఆదివారాల్లో ఒకే ఒక జీవితంకు మంచి వసూళ్లే వచ్చాయి.
కానీ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే లాంగ్ రన్ ఉంటుందని అంచనా వేశారు. వీక్ డేస్‌లో కూడా ఈ చిత్రం బలంగా నిలబడుతుందనుకున్నారు. కానీ గత నెలలో బింబిసార, సీతారామం, కార్తికేయ-2 చిత్రాల మాదిరి ఈ సినిమా మ్యాజిక్ చేయలేకపోయింది. థియేటర్లను జనాలతో నింపలేకపోతోంది.
ఒకే ఒక జీవితం థియేటర్లు వీక్ డేస్‌లో ఓ మోస్తరు ఆక్యుపెన్సీతో కనిపిస్తున్నాయి. గత నెలలో సినిమాల మాదిరి ఇది జనాలను పెద్ద ఎత్తున ఆకర్షించలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సినిమాలో సెంటిమెంట్ డోస్ కొంచెం ఎక్కువ కావడం, సినిమా నెమ్మదిగా నడవడం మైనస్ అయి ఉండొచ్చు. ఐతే ఇటు తెలుగులో, అటు తమిళంలో సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులైతే ఉన్నాయి. పెద్దగా లాభాలు ఆశించడానికైతే లేదు.
కానీ చాలా మంచి టాక్ తెచ్చుకోవడం వల్ల సినిమాకు వేరే రకమైన ప్రయోజనం ఉంది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను నిర్మాతలు విడుదలకు ముందు అమ్మేయలేదు. సినిమా మీద నమ్మకంతో అట్టిపెట్టుకున్నారు. శర్వా మార్కెట్ దెబ్బ తిన్న దృష్ట్యా విడుదలకు ముందు అయిన కాడికి ఆ హక్కులను అమ్మాల్సి వచ్చేది. ఇప్పుడు సినిమాకు మంచి టాక్ రావడంతో డిజిటల్, శాటిలైట్ రైట్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. రీమేక్ రైట్స్ కోసం కూడా డిమాండ్ ఉండొచ్చు. వీటి ద్వారా నిర్మాత మంచి ఆదాయమే అందుకునేలా ఉన్నాడు.
This post was last modified on September 14, 2022 9:14 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…