బాహుబలి-2లో తొలి పాట ఆరంభానికి ముందు భారీ విల్లుతో అగ్నితో కూడిని బాణాన్ని రావణాసురుడి మీదికి వదిలే సన్నివేశం ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. గూస్ బంప్స్ సీన్ అనే మాటకు ఇది అసలైన నిర్వచనం అని చెప్పొచ్చు. ఆ ఎలివేషన్, ఆ విజువల్ ప్రభాస్ అభిమానులను చాలా కాలం వెంటాడుతుందనడంలో సందేహం లేదు.
ఇదే సన్నివేశాన్ని ప్రభాస్ నిజ జీవితంలో చేసి చూపిస్తే ఎలా ఉంటుందన్న ఊహే అద్భుతంగా ఉంటుంది. ఇందుకోసం అయోధ్యలో సన్నాహాలు జరిగాయి కూడా. దసరా సందర్భంగా రావణాసుర దహన కార్యక్రమానికి ప్రభాస్‌తో పాటు ఆదిపురుష్ టీం హాజరయ్యేలా.. అక్కడ ప్రభాస్ బాహుబలి సీన్‌ను రిపీట్ చేస్తూ బాణం విసిరేలా ప్లాన్ చేశారు.
ఇక్కడి నుంచే ఆదిపురుష్ టీం తమ సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టాలని అనుకుంది. ఈ చిత్రం రామాయణం నేపథ్యంలో నడుస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రమోషన్లు మొదలుపెట్టడానికి ఇంతకంటే మంచి ముహూర్తం మరొకటి ఉండదని భావించారు. ఇక్కడే ఆదిపురుష్ టీజర్ కూడా లాంచ్ చేయడానికి నిర్ణయించినట్లు కూడా వార్తలొచ్చాయి.
కానీ ఇప్పుడు కృష్ణంరాజు మరణంతో ఈ ప్రణాళిక మారినట్లు తెలుస్తోంది. పెదనాన్న చనిపోయిన మూడు వారాల్లో ఇలాంటి భారీ కార్యక్రమంలో పాల్గొనడం కరెక్ట్ కాదని ప్రభాస్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకలో ప్రభాస్ పాల్గొనే అవకాశాలు లేవనే అంటున్నారు. ఐతే ఆదిపురుష్ టీం మాత్రం ఈ వేడుకలో పాల్గొంటుందని, టీజర్ కూడా అక్కడి నుంచే లాంచ్ చేస్తారని సమాచారం.
This post was last modified on September 14, 2022 2:45 pm
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…