Movie News

రంగంలోకి దిగిన సురేష్ బాబు…డైరెక్టర్ కి క్లాస్ ?

కొన్ని సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ కి దర్శకులు దూరంగా ఉంటారు. మీడియా ముందు వచ్చి మాట్లాడటం కొందరికి కాస్త ఇబ్బంది ఉంటుంది. అదొక కారణం అయితే , షూటింగ్ లో వచ్చే గొడవలు మరో కారణం. అయితే రెండో కారణం చేత సుధీర్ వర్మ తను డైరెక్ట్ చేసిన ‘శాకిని డాకిని’ సినిమా ప్రమోషన్స్ లో కనిపించడం లేదనే రూమర్ ఉంది. దీనికి ఇది వరకే సూచాయగా క్లారిటీ ఇచ్చింది నిర్మాత సునీత.

అయితే తాజాగా మరోసారి ఆమె డైరెక్టర్ సుధీర్ వర్మ గురించి మాట్లాడారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంట్రాక్ట్ అవుతూ మా డైరెక్టర్ ప్రమోషన్స్ లో కనిపించకపోవడానికి ప్రధాన కారణం అతను రవితేజతో పెద్ద సినిమా చేస్తుండటమే. ఆ సంగతి ఇది వరకే చెప్పాము. ఇప్పుడు ఆయన ఈ నెల 15 నుండి సినిమా ప్రమోషన్స్ లో కనిపిస్తారు అంటూ చెప్పుకున్నారు. ఈ నెల 14 వరకు ఆయనకి రావణాసుర షూట్ ఉంది. అందుకే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా రాలేదు. 15 నుండి మాతో పాటు సుధీర్ కూడా సినిమాను ప్రమోట్ చేస్తాడని చెప్తూ మరోసారి క్లారిటీ ఇచ్చింది.

సుధీర్ వర్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేనంత బిజీ ఆ? అనేది ఇక్కడ మాట్లాడుకోవాలి. చేతిలో పెద్ద సినిమా ఉంది సరే షూటింగ్ ఫినీష్ అయ్యాక తను డైరెక్ట్ చేసిన ఫంక్షన్ కి వచ్చి నాలుగు మాటలు చెప్పలేనంత బిజీ గా వున్నడా? అయినా ఈ సినిమా విషయంలో డైరెక్టర్ సుధీర్ వర్మ హార్ట్ అయ్యాడనేది క్లియర్ గా తెలుస్తోంది. లోలోపల ఏం జరిగిందో తెలియదు కానీ ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి అతను ఆసక్తి చూపించడం లేదు. రిలీజ్ అయిన కొత్త సినిమా గురించి చెప్తూ ట్వీట్ చేశాడు కానీ శాకిని డాకిని రిలీజ్ గురించి ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. లేటెస్ట్ గా సురేష్ బాబు ఇన్వాల్వ్ అవ్వడం సుధీర్ వర్మ తో మాట్లాడటం జరిగిందని భోగట్టా.

బహుశా సురేష్ బాబు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సుధీర్ ప్రమోషన్స్ లో పాల్గొన్ననున్నాడు కాబోలు. ఏదేమైనా రిలీజ్ కి ఒక్కరోజు ముందు సుధీర్ ప్రమోషన్స్ లో పాల్గొంటే ఏమవుతుంది ? ముందు నుండి ప్రమోషన్స్ లో పార్టిసిపెంట్ చేసి తన రాపో తో రవితేజ లాంటి హీరోను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలిస్తే ఎంతో కొంత బజ్ ఉండేది. మరి చూడాలి సుధీర్ మీడియా ముందుకొచ్చి వీటన్ని గురించి డైరెక్టర్ క్లారిటీ ఇస్తాడేమో.

This post was last modified on September 14, 2022 12:58 pm

Share

Recent Posts

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

45 minutes ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

49 minutes ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

2 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

2 hours ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

3 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

4 hours ago