గాడ్ ఫాదర్ ప్రమోషన్లు మెల్లగా ఊపందుకున్నాయి. రేపు విడుదల కాబోతున్న మొదటి ఆడియో సింగల్ కి సంబంధించి నిన్న వదిలిన ప్రీ టీజర్ మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా చిరంజీవి సల్మాన్ ఖాన్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న పాట కావడంతో తమన్ ఏ రేంజ్ లో కొట్టి ఉంటాడోనని టైమర్ పెట్టుకుని మరీ ఎదురు చూశారు. ఎప్పటిలాగే కొణిదెల సంస్థ సాంకేతిక కారణాలు సాకుగా చూపి ఆలస్యం చేయడం, దీని మీద ఫ్యాన్స్ కస్సుమనడం జరిగిపోయాయి. సరే సాంగ్ బాగుంటే చాలు ఇవన్నీ మర్చిపోవడం ఎంతసేపు.
తార్ మార్ తక్కర్ మార్ అనే చిన్నపిల్లల రైమ్ లో పదాలు తీసుకుని తమన్ ఏదో వెరైటీగా ట్రై చేసిన కంపొజిషన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి దారి తీసింది. తనే గతంలో ఇచ్చిన క్రాక్, బ్రూస్ లీ ట్యూన్ల తరహాలో రిపీట్ అనిపించిందని మీమర్స్ పూర్తి సాక్ష్యాధారాలతో రంగంలోకి దిగారు. కేవలం కొన్ని సెకండ్ల వీడియోని పట్టుకుని శల్యపరీక్ష చేయడం కరెక్ట్ కాదు కానీ ఒక లెజెండరీ కాంబినేషన్ లో ప్రెజెంట్ చేయబోతున్నప్పుడు భారీగా ఊహించుకోవడం ఆడియెన్స్ తప్పు కాదు. దానికి తగ్గట్టే ఓ రేంజ్ లో అది పండాలి. కానీ ప్రస్తుతానికి అలా జరగలేదు.
రేపు ఫుల్ సాంగ్ వచ్చాక ఈ అభిప్రాయంలో ఏదైనా మార్పు వస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా తమన్ మళ్ళీ బ్యాక్ టు ఫామ్ రావాల్సిన అవసరం చాలా ఉంది. భారీ ప్రాజెక్టులన్నీ తనకే రావడం వల్లనో లేక ఒత్తిడి మీద పని చేయాల్సి వచ్చిందనో కారణం ఏదైతేనేం తమన్ మార్కు మేజిక్ గాడ్ ఫాదర్ టీజర్ లోనూ కనిపించలేదు. ఇక నెక్స్ట్ ట్రైలర్ వంతు ఉంది. అందులోనైనా తన మాయాజాలం జరగాలి. సినిమా రిలీజ్ కు ఇరవై రోజులే ఉన్న నేపథ్యంలో గాడ్ ఫాదర్ స్పీడ్ పెంచాల్సి ఉంది. అసలే ది ఘోస్ట్ తో పోటీ ఉంది. వారం ముందు పొన్నియన్ సెల్వన్ 1 ఉంటుంది.
This post was last modified on September 14, 2022 11:50 am
పండక్కు రిలీజై హిట్టు కొట్టిన రెండు సినిమాల్లో చైల్డ్ ఎలిమెంట్ కీలక పాత్ర పోషించడాన్ని కొట్టిపారేయలేం. ముందుగా డాకు మహారాజ్…
తెలుగు సినీ పరిశ్రమ ఈ రోజు హైదరాబాద్లో ఎంత పెద్ద స్థాయిలో నిలబడుతోందో తెలిసిందే. ఇండియాలోనే అతి పెద్ద ఇండస్ట్రీల్లో…
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పెర్ఫార్మన్స్ పరంగా వెంకటేష్ తర్వాత ఎక్కువ స్కోప్ దొరికింది ఐశ్యర్య రాజేష్ కే. గ్లామర్ పరంగా…
గత ఏడాది ‘కల్కి: 2898 ఏడీ’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్కు అతి…
ఎప్పుడో 2012లో మొదలైన తమిళ సినిమా.. మద గజ రాజా. కొన్ని కారణాల వల్ల మేకింగ్లో ఆలస్యం జరిగి.. 2013…
ఏపీ రాజధాని అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు పండగ పూట భారీ కానుక అందించారు. గత ఏడాదిన్నరగా నిలిచి పోయిన…