శింబు హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన వెందు తనిన్దాతు కాడు తెలుగులో ది లైఫ్ అఫ్ ముత్తుగా ఈ నెల 15న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ బుకింగ్ యాప్స్ లో టికెట్ల అమ్మకాలు కూడా మొదలుపెట్టేశారు. అంతా సవ్యంగా ఉందని ఎదురు చూస్తున్న తరుణంలో సాంకేతిక కారణాల వల్ల రెండు రోజులు ఆలస్యంగా టాలీవుడ్ వెర్షన్ ని రిలీజ్ చేయబోతున్నట్టు ఇక్కడి హక్కులు సొంతం చేసుకున్న స్రవంతి మూవీస్ అఫీషియల్ గా ప్రకటించింది. తమిళంలో మాత్రం ముందు చెప్పిన డేట్ కే వస్తుంది. ఎటొచ్చి డబ్బింగ్ దే ఆలస్యం.
సకాలంలో అనువాద కార్యక్రమాలు పూర్తి కాకపోవడం వల్లే ఈ వాయిదా తప్పలేదని వినికిడి. నిజానికి ఈ డీల్ కేవలం ఒక వారం ముందు జరిగింది. కనీసం ప్రమోషన్ చేయడానికి తగినంత టైం లేని ఒత్తిడిలో నిర్మాత రవి కిషోర్ లైఫ్ అఫ్ ముత్తుని కొన్నారు. అది కూడా శింబుకి మంచి స్నేహితుడైన హీరో రామ్ రికమండేషన్ తోనే ఇదంతా జరిగిందనే టాక్ ఉంది. శింబుకి ఇక్కడ మార్కెట్ లేదు. ఏదో ఆషామాషీగా సినిమా వదలితే ఓపెనింగ్స్ కష్టమే. ఏదో కంటెంట్ మీద నమ్మకంతో ధైర్యం చేశారు కానీ పోస్టర్లు, టీజర్ హైప్ తెచ్చేలా లేవు.
గతంలో మానాడు విషయంలోనూ అచ్చం ఇలాగే జరిగింది. ఉదయం షో పడతాయి అనంగా ఉన్నట్టుండి షోలు రద్దు చేశారు. కట్ చేస్తే అసలు రిలీజే కాలేదు. తర్వాత కొంత కాలానికి సురేష్ సంస్థ రీమేక్ హక్కులను కొనేసింది. ఇంకా మొదలుపెట్టలేదు కానీ ఈలోగా ఓటిటిలో తెలుగు ఆడియోతో సహా వచ్చినప్పుడు మన ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ది లైఫ్ అఫ్ ముత్తుకి ఆ సమస్య రాదు కానీ రెండు రోజులు లేట్ అంటే ఈలోగా కోలీవుడ్ నుంచి రిపోర్టులు రివ్యూలు వచ్చేస్తాయి. అవి పాజిటివ్ గా ఉంటే ప్లస్ అవుతుంది. లేదూ అంటే అదో కొత్త ఇబ్బంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
This post was last modified on September 14, 2022 6:41 am
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…