Movie News

మహేష్ చేస్తోంది రైటా రాంగా

సూపర్ స్టార్ అంటే ఒకప్పుడు కృష్ణ గారే కానీ ఇప్పటి జెనరేషన్ కు మాత్రం ఆయన వారసుడు మహేష్ బాబే. అందుకే సినిమాలో కంటెంట్ బాగుంటే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్, యావరేజ్ ఉంటే మినిమమ్ సూపర్ హిట్ తో గత మూడేళ్లుగా గ్రాఫ్ మాములుగా లేదు. సర్కారు వారి పాట మీద ఎన్ని కామెంట్స్ వచ్చినా కమర్షియల్ గా పెద్ద స్కేల్ దక్కిందంటే అది ప్రిన్స్ ఇమేజ్ వల్లే. పోకిరి లాంటి పాత రీ రిలీజులతో సైతం హౌస్ ఫుల్ కలెక్షన్లు రాబట్టడం ఒక్క మహేష్ ఫ్యాన్స్ కే సాధ్యమయ్యింది. అందుకే ఇప్పుడు ఇతర హీరోల అభిమానులు కూడా తమ స్టార్ల క్లాసిక్స్ ని థియేటర్లలో వేసుకోవడం మొదలుపెట్టారు

అంతా బాగానే ఉంది కానీ ఇటీవలే మహేష్ బాబు ఒక ప్రైవేట్ ఛానల్ తో ప్రమోషన్ పరంగా ఒక ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కూతురు సితార తో కలిసి డాన్స్ రియాలిటీ షోకు అతిథిగా వెళ్ళొచ్చాడు. ఇప్పుడు అందులోనే ఒక టీవీ సీరియల్ కు ప్రచారకర్తగా కనిపించడం కొందరు సగటు ప్రేక్షకులకు అంతగా నచ్చడం లేదు. మహేష్ రేంజ్ ఐకాన్ ఇలా సీరియళ్లు చూడమని చెప్పడమేంటని వాళ్ళ కంప్లయింట్. భారీ పారితోషికం ఇచ్చినందుకు వాళ్ళ ప్రోగ్రాంలకు పబ్లిసిటీ ఇవ్వడం కరెక్టే కానీ మరీ ఇలాంటి వాటికి కాదనేది సగటు జనాల అభిప్రాయం.

ఇది రైటా రాంగా అంటే రెండింటికి ఒక్కో కోణం ఉంది. ప్రస్తుతం రెండేళ్లకు ఒక సినిమా మాత్రమే చేయగలుగుతున్న మహేష్ సేవా కార్యక్రమాల కోసం, చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం తగినంత మొత్తాన్ని సమకూర్చుకోవాలంటే ఇలాంటి ఆదాయ వనరులు వెతుక్కోవడం తప్పేమి కాదు. ఇవి చేయకపోతే డబ్బులుండవని కాదు. అదనంగా వచ్చేది ఏదైనా నలుగురి మంచికి ఉపయోగపడుతున్నప్పుడు అందులో తప్పు పట్టడానికేం లేదు. కాకపోతే స్టార్ వర్షిప్ ఎక్కువగా ఉండే దక్షిణాది రాష్ట్రాల్లో మహేష్ స్థాయి హీరో ఇలా చేయడం కొందరికి నచ్చకపోవచ్చు.

This post was last modified on September 13, 2022 10:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

11 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

12 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

13 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

13 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

13 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

14 hours ago