ఇటీవలే అమెరికా, బ్రిటన్ దేశాల్లో సెప్టెంబరు 3వ తేదీని నేషనల్ సినిమా డేగా జరుపుకొన్నారు. ఆ సందర్భంగా సినిమా టికెట్ ధరను తగ్గించి 3 డాలర్లకు ఫిక్స్ చేశారు. మామూలుగా టికెట్ ధర మినిమం 8 డాలర్లుంటుంది. డిమాండును బట్టి ప్రిమియర్ షోలకు 35-40 డాలర్ల రేటు కూడా పెడుతుంటారు. అలాంటిది 3 డాలర్లకు మల్టీప్లెక్సుల్లో సినిమా చూసే అవకాశం దక్కడంతో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు.
తెలుగు సినిమా అయిన కార్తికేయ-2 నాలుగో వీకెండ్లో హౌస్ ఫుల్స్‌తో నడిచిందంటే నేషనల్ సినిమా డే సందర్భంగా తగ్గించిన రేట్లే కారణం. ఇప్పుడు ఇండియాలో కూడా నేషనల్ సినిమా డేను జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 16న ఇందుకు ముహూర్తం కుదిరింది. ఈ సందర్భంగా మల్టీప్లెక్సులన్నింట్లోనూ రూ.75 రేటును ఫిక్స్ చేశారు.
ఈ మేరకు కొన్ని రోజుల ముందే ప్రకటన రావడంతో సినీ ప్రియులు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఐతే కారణాలేంటో ఏమో కానీ.. సెప్టెంబరు 16న నేషనల్ సినిమా డేను జరుపుకోవడం లేదు. దీన్ని వారం వాయిదా వేశారు. సెప్టెంబరు 23కు ఫిక్స్ చేశారు. ఆ రోజే జాతీయ సినీ వేడుకలు జరగనున్నాయి. టికెట్ ధర రూ..75 ఉండబోతోంది ఆ శుక్రవారం రోజు.
ఈ ఏడాది చివర్లో అవతార్-2 రిలీజ్ కానున్న నేపథ్యంలో అవతార్-2ను 23నే రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీతో రీమాస్టర్ చేసి రిలీజ్ చేస్తుండడంతో ఆ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. అదే రోజు టికెట్ ధరను రూ.75కు తగ్గిస్తుండడంతో అవతార్ థియేటర్లు జనాలతో నిండిపోవడం ఖాయం. అదే రోజు రిలీజయ్యే వేరే చిత్రాలకు కూడా మంచి ఆక్యుపెన్సీనే ఉండొచ్చు.
This post was last modified on September 13, 2022 4:46 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…