ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రాజమౌళి హవా నడుస్తోంది. ఆయనకు మరే దర్శకుడూ దరిదాపుల్లో లేడు. ఆయన పట్టిందల్లా బంగారమే అవుతోంది. బాహుబలి తర్వాత మళ్లీ బాక్సాఫీస్ దగ్గర అలాంటి మ్యాజిక్ చేయడం జక్కన్న వల్ల కాదనుకున్నారు కానీ.. ఆర్ఆర్ఆర్‌తో దానికి దీటైన విజయమే దక్కించుకున్నాడు రాజమౌళి. ఈ సినిమాతో బాహుబలిని మించి అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించాడాయన.
ఈ విజయాన్ని ఆస్వాదిస్తుండగానే.. ఇప్పుడు జక్కన్న ఖాతాలోకి మరో ఘనవిజయం జమ అయింది. అదే.. బ్రహ్మాస్త్ర. ఈ చిత్రానికి దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించడమే కాక.. ఇక్కడ మేజర్ సిటీల్లో సినిమాను గట్టిగా ప్రమోట్ చేశాడు. ఆన్ లైన్లో కూడా ప్రమోషన్ బాగానే చేశాడు.
ఐతే రాజమౌళి ఏ ప్రయోజనం లేకుండా బ్రహ్మాస్త్ర కోసం ఇంత కష్టపడలేదు. తన మిత్రుడైన బళ్లారి సాయితో కలిసి ఈ చిత్రాన్ని ఏపీ వరకు రాజమౌళే డిస్ట్రిబ్యూట్ చేశాడు. డబ్బులు సాయివి కాగా.. తన బ్రాండ్‌ను ఉపయోగించడం, అలాగే ప్రమోషన్లు చేయడం ద్వారా లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు జక్కన్న. ఆయన పేరు సినిమాకు బాగానే ఉపయోగపడింది.
బ్రహ్మాస్త్ర తెలుగులో హిందీ చిత్రాల వసూళ్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది. తొలి వీకెండ్లో రూ.15 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఏపీలో ఆల్రెడీ సినిమాకు బ్రేక్ ఈవెన్ అయిపోయింది. లాభాల బాట పట్టేసింది. వీకెండ్ తర్వాత కూడా బ్రహ్మాస్త్రకు మంచి వసూళ్లే వస్తున్నాయి. ఫుల్ రన్లో పెట్టుబడి మీద రెట్టింపు ఆదాయం అందించేలా ఉంది. కాబట్టి జక్కన్న ఈ చిత్రంతో నక్కతోక తొక్కినట్లే.
This post was last modified on September 13, 2022 11:17 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…