మలయాళం బ్లాక్ బస్టర్స్ రీమేక్ అంటే మన హీరోలకు, దర్శక నిర్మాతలకు ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో మొదలుపెట్టి రాజశేఖర్ దాకా అందరూ ట్రై చేస్తున్నవాళ్ళే. అందుకే అక్కడ దేనికైనా హిట్ టాక్ రావడం ఆలస్యం వీలైనంత త్వరగా హక్కులు పొందేందుకు టాలీవుడ్ ప్రొడ్యూసర్లు పోటీ పడుతుంటారు. కాకపోతే ఒరిజినల్ వెర్షన్లు ఓటిటిలో త్వరగా వచ్చేస్తున్న ట్రెండ్ లో వీలైనంత త్వరగా రీమేకులను సెట్స్ పైకి తీసుకెళ్లడం చాలా అవసరం. ఉత్సాహం ఆపుకోలేక సబ్ టైటిల్స్ తో చూసే బాపతు లక్షల్లో ఉన్నారు.
అలాంటిది నేరుగా తెలుగులో దొరికితే వదులుతారా. విషయానికి వస్తే ఇటీవలే టోవినో థామస్ నటించిన తళ్ళుమాల అక్కడ రఫ్ఫాడేసింది. కేవలం పది కోట్ల బడ్జెట్ తో తీస్తే ఏకంగా వంద కోట్ల గ్రాస్ సాధించి ఆల్ టైం కేరళ టాప్ 10లో చోటు సంపాదించుకుంది. మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీని క్లాసు మాసు ఎగబడి చూశారు. దీన్ని తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా పునఃనిర్మించే ఆలోచనలో ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్ ఉన్నట్టుగా టాక్. రైట్స్ ని ఇప్పటికే 85 లక్షలకు కొనుగోలు చేశారని వినికిడి.
అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడీ తళ్ళుమాల నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. మాములే కదా అంటారా. ట్విస్ట్ ఏంటంటే చక్కగా తెలుగు డబ్బింగ్ కూడా పెట్టేశారు. అంటే ఉపశీర్షికలు అవసరం లేకుండా నేరుగా ఎంజాయ్ చేయొచ్చన్న మాట. ఇంకేముంది దీని గురించి రివ్యూలు, వార్తల్లో చదివిన వాళ్ళు ఆలస్యం చేయకుండా చూసేస్తున్నారు. ఒకవేళ నిజంగా హక్కులు కొని ఉంటే కనీసం తెలుగు ఆడియో అయినా రాకుండా జాగ్రత్త పడాల్సింది. మానాడు విషయంలోనూ ఇలాగే చేశారు. అంతకు ముందు లూసిఫర్ కూ ఇదే అనుభవం ఉంది. అగ్రిమెంట్ల టైంలో చూసుకోలేదేమో.
This post was last modified on September 13, 2022 6:18 am
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…