విడుదలకు ముందు సోషల్ మీడియాలో కారణం లేకుండా విపరీతమైన నెగెటివిటీ.. దీనికి తోడు ట్రైలర్‌కు మిశ్రమ స్పందన.. గ్రాఫిక్స్ మీద విమర్శలు.. తొలి రోజు టాక్ కూడా కొంచెం డివైడ్‌గానే వచ్చింది. కానీ ఈ ప్రతికూలతలన్నింటినీ దాటుకుని బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడింది. కలెక్షన్ల పరంగా రికార్డుల మోత మోగిస్తూ వీకెండ్‌ను పూర్తి చేసుకుంది.
తొలి రోజు, అలాగే తొలి వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా బ్రహ్మాస్త్ర రికార్డులు నెలకొల్పడం విశేషం. కరోనా బ్రేక్ తర్వాత ఓ మోస్తరు ఓపెనింగ్స్ సాధించడం కూడా కష్టమైపోతున్న పరిస్థితుల్లో ఈ సినిమా ఇండియా వైడ్ రూ.125 కోట్లు, వరల్డ్ వైడ్ రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం గొప్ప విషయమే.
రణబీర్ కపూరే హీరోగా నటించిన సంజు సినిమా ఇండియాలో రూ.120 కోట్లతో వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పగా.. దాని కన్నా 5 కోట్లు ఎక్కువ వసూళ్లు రాబట్టి బ్రహ్మాస్త్ర కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ రకంగా తన రికార్డును రణబీరే బద్దలు కొట్టినట్లయింది. యుఎస్ సహా పలు దేశాల్లో బ్రహ్మాస్త్ర భారీ వసూళ్లు సాధిస్తోఓంది. మొత్తంగా చూస్తే బ్రహ్మాస్త్రకు బాక్సాఫీస్ దగ్గర అదిరే ఆరంభం లభించిందన్నది వాస్తవం.
కాకపోతే ఆరంభ శూరత్వానికి పరిమితం అయితే కష్టమే అవుతుంది. ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్లకు పైమాటే. థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరిగింది. వరల్డ్ వైడ్ రూ.600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే ఇది బ్రేక్ ఈవెన్ అవుతుంది. అది జరగాలంటే సినిమా చాలా రోజులు థియేటర్లలో నిలవాలి. నిలకడగా వసూళ్లు సాధించాలి. ఆదివారం తర్వాత మేజర్ డ్రాప్ లేకపోవడం, సోమవారం కూడా ఓ మోస్తరు వసూళ్లు సాధించడంతో పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ.. డివైడ్ టాక్ నేపథ్యంలో సినిమాకు లాంగ్ రన్ ఉంటుందా లేదా అన్నదే సందేహంగా మారింది.
This post was last modified on September 12, 2022 9:14 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…