సూపర్ గుడ్ ఫిలిమ్స్.. దక్షిణాదిన లెజెండరీ స్టేటస్ ఉన్న బ్యానర్. 80, 90 దశకాల్లో అటు తమిళంలో ఇటు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించింది ఈ సంస్థ. రాజా, సూర్యవంశం, నువ్వు వస్తావని… ఇలా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన కల్ట్ మూవీస్ జాబితా పెద్దదే.
అయితే 2000 తర్వాత ఎదురైన కొన్ని పరాజయాల కారణంగా ఈ సంస్థ జోరు తగ్గింది. గత దశాబ్ద కాలంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పేరు పెద్దగా వినిపించలేదు. ఇటీవల ఆ సంస్థ మళ్లీ యాక్టివ్ అవుతోంది. తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సూపర్ గుడ్ వారి సినిమానే. తమిళంలోనూ ఆ సంస్థ ఒకటి రెండు సినిమాలు నిర్మిస్తోంది.
కాగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వందో సినిమాకు చేరువ అవుతుండటం విశేషం. దాని గురించి తాజా కబురు బయటికి వచ్చింది. ఈ మైల్ స్టోన్ మూవీలో దళపతి విజయ్ కథానాయకుడిగా నటించనున్నాడు. ఈ విషయాన్ని సూపర్ గుడ్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జీవా వెల్లడించాడు. తమ సంస్థ వందో సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు అతను తెలిపాడు.
ఈ చిత్రంలో తాను కూడా నటించే అవకాశాలు ఉన్నట్లు కూడా అతను వెల్లడించాడు. తాను పారితోషికం కూడా తీసుకోనని, ఈ సినిమాలో నటించే అవకాశం ఇవ్వమని తన తండ్రికి తెలిపినట్టు జీవా చెప్పడం విశేషం. అయితే ఈ సినిమాకు దర్శకుడు, కథ ఏమీ లాక్ కానట్లే ఉంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. గతంలో సూపర్ గుడ్ సంస్థ లో విజయ్ కొన్ని బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. అతను నటించిన శుభాకాంక్షలు, నువ్వు వస్తావని తమిళ వెర్షన్లు సూపర్ గుడ్ సంస్థ నిర్మించినవే.
This post was last modified on September 12, 2022 9:11 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…