Movie News

బాలీవుడ్.. పాత రోజులు వచ్చాయి

మామూలుగా చూస్తే డబ్బు విలువ తగ్గొచ్చు కానీ.. సినిమాలకు రోజు రోజుకు వసూళ్ల లెక్క పెరగడమే తప్ప తగ్గడం అన్నది ఉండదు. కానీ కరోనా పుణ్యమా అని హిందీ సినిమాల పరిస్థితి దీనికి భిన్నంగా తయారయింది. అక్కడ పెద్ద హీరోల సినిమాలకు తొలి రోజు 30-40 కోట్ల వసూళ్లు అనేది చాలా సామాన్యమైన విషయంగా ఉండేది.

కానీ కరోనా తర్వాత అందులో పది ఇరవై శాతానికి వసూలు పడిపోయాయి. తొలి రోజు వసూళ్లు 10 కోట్లు దాటితేనే మురిసిపోయే పరిస్థితి వచ్చింది. ఇoదుకు కారణాలు ఏంటి అన్నది పక్కన పెడితే బాలీవుడ్ పాత రోజులకు వెళ్ళదేమో అన్న భయాలు పట్టుకున్నాయి. కానీ బ్రహ్మాస్త్ర సినిమా మళ్లీ బాలీవుడ్ కు పునర్వైభవం తెచ్చిపెట్టింది.

తొలి రోజు వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలిపి 75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన బ్రహ్మాస్త్ర.. రెండో రోజు కూడా తగ్గలేదు. డివైడ్ టాక్ ను తట్టుకుని నిలబడ్డ ఈ చిత్రం శనివారం ఓవరాల్ గా 50 కోట్ల దాకా వసూలు రాబట్టినట్లు ట్రేడ్ పండితుల అంచనా. ఆదివారం కూడా సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరిగాయి. తొలి రెండు రోజులకు దీటుగా మూడో రోజు వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. బ్రహ్మాస్త్ర ఆల్రెడీ 100 కోట్ల మార్కును దాటేసింది. రెండు వందల కోట్ల క్లబ్బు వైపు పరుగులు పెడుతోంది. వీకెండ్ అయ్యాక మేజర్ డ్రాప్ లేకపోతే సినిమా అడుగులు వేస్తున్నట్లే.
విడుదలకు ముందు బాయ్ కాట్ బ్యాచ్ నుంచి విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొని.. రిలీజ్ తర్వాత డివైడ్ టాక్ ను తట్టుకుని సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది అంటే గొప్ప విషయమే. బ్రహ్మస్త్ర రిజల్ట్ కచ్చితంగా బాలీవుడ్ కు గొప్ప రిలీఫ్ అనడంలో సందేహం లేదు. ర‌ణ‌బీర్ క‌పూర్, ఆలియా భట్‌, అమితాబ్ బ‌చ్చ‌న్, నాగార్జున ముఖ్య పాత్రలు పోషించిన బ్రహ్మాస్త్ర చిత్రాన్ని అయాన్ ముఖర్జీ రూపొందించాడు. కరణ్ జోహార్ నిర్మాత.

This post was last modified on September 11, 2022 5:46 pm

Share

Recent Posts

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

2 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

3 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

5 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

5 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

7 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

8 hours ago