టాకులు రివ్యూలతో సంబంధం లేకుండా బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ బాక్సాఫీస్ వద్ద ఊహించిన దాని కన్నా భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే హౌస్ ఫుల్ బోర్డులు పడిపోతున్నాయి. అనుకున్నంత గొప్పగా కంటెంట్ లేదనే మాట వినిపిస్తున్నా సరే త్రీడి ఎఫెక్ట్ లో ఓసారైనా చూడాల్సిందేనని అధిక శాతం ఆడియన్స్ ఫిక్స్ అవ్వడంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. సీతారామం ఓటిటిలో వచ్చేయడం, కార్తికేయ 2 అయిదో వారంలో అడుగుపెట్టడం లాంటి కారణాల వల్ల ప్రేక్షకులకు బ్రహ్మాస్త్ర, ఒకే ఒక జీవితం మాత్రమే ఆప్షన్లుగా మిగిలాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు ఆరు కోట్లకు పైగా రాబట్టడం అంటే మాములు విషయం కాదు. వరల్డ్ వైడ్ 75 కోట్ల గ్రాస్ వచ్చిందని యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. ఈ ఏడాదిలో బాలీవుడ్ కు వచ్చిన అతి పెద్ద ఓపెనింగ్ ఇది. శని ఆదివారాలు దీనికి ధీటుగా కొనసాగింపు ఉంటుందని, వారం తిరిగేలోపు బ్రేక్ ఈవెన్ కు చేరుకోవడం ఖాయమని ట్రేడ్ నమ్మకంతో ఉంది. ఎలాగూ రాబోయే రెండు వారాలు చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. సోమవారం నుంచి కూడా బ్రహ్మాస్త్ర ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం బ్లాక్ బస్టర్ స్టాంప్ పడొచ్చు. కాకపోతే అదంత ఈజీ కాదు.
ఇప్పటికిప్పుడు బ్రహ్మాస్త్రను ఏ స్థాయి విజయమో వర్ణించలేం కానీ ఒకవేళ కంటెంట్ ప్లస్ గ్రాఫిక్స్ మీద దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇంకా బలమైన ఫోకస్ పెట్టుంటే మాత్రం బాహుబలి స్థాయిలో అరాచకం ఉండేదన్న కామెంట్లో నిజం లేకపోలేదు. నెరేషన్, బోర్ కొట్టించే లవ్ ట్రాక్ లాంటి మైనస్సులు ఎన్ని ఉన్నా చిన్నపిల్లల డిమాండ్ తో ఫ్యామిలీస్ బ్రహ్మాస్త్ర థియేటర్లకు కదులుతున్నాయి. అసలైన పరీక్ష మండే నుంచి మొదలవుతుంది కాబట్టి అక్కడి నుంచి ఒక రెండు మూడు రోజులు ట్రెండ్ ని గమనించాలి. ఫైనల్ స్టేటస్ ఎలా ఉండబోతున్నా బాలీవుడ్ కు పెద్ద రిలీఫ్ దక్కిన మాట వాస్తవం.
This post was last modified on September 11, 2022 10:36 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…