ఇప్పటి తరానికి రెబెల్ స్టార్ అంటే ప్రభాసే కానీ ఆ బిరుదు యజమాని మాత్రం డార్లింగ్ ని ఇండస్ట్రీకి తీసుకొచ్చిన కృష్ణంరాజుగారిదే. కోట్లాది అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తుతూ ఇవాళ ఉదయం 3,25 నిమిషాలకు ఆయన పరమపదించడం యావత్ సినీ రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 83 ఏళ్ళ వయసులోనూ హుషారుగా మాట్లాడుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించే కృష్ణంరాజు గారు చివరి శ్వాస వరకు నటనే ప్రాణంగా బ్రతికారు.
అనారోగ్యం కొంత ఇబ్బంది పెడుతున్నా రాధే శ్యామ్ లో కీలకమైన పాత్ర చేయడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పెదనాన్న అంటే ఎంతో ఆప్యాయత చూపించే ప్రభాస్ మానసిక పరిస్థితిని ఫ్యాన్స్ ఊహించుకోలేకపోతున్నారు. కృష్ణంరాజు గారి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. 1940 జనవరి 20 పుట్టినరోజు. జీవిత భాగస్వామి శ్యామలాదేవి. ముగ్గురు ఆడపిల్లలు సంతానం. ఇంకా ఎవరికి వివాహం కాలేదు. ఆయన మొదటి సినిమా చిలకా గోరింక(1966).
కెరీర్ ప్రారంభంలో చిన్న వేషాలతో పాటు అవే కళ్ళు లాంటి చిత్రాల్లో విలన్ గానూ అద్భుతంగా మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబుల హయాంలో అంత తీవ్రమైన పోటీలోనూ నెగ్గుకొచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. 80 దశకంలో రెండుసార్లు నంది అవార్డు అందుకున్నారు. భక్త కన్నప్ప గొప్ప మైలురాయి. నిర్మాతగానూ గోపికృష్ణ బ్యానర్ పై కృష్ణవేణి, అమరదీపం లాంటి ఎన్నో మర్చిపోలేని గొప్ప క్లాసిక్స్ ని ఇచ్చారు.
ఇప్పుడంటే బాహుబలి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ 1986లో తాండ్ర పాపారాయుడు లాంటి గ్రాండియర్ తో అప్పట్లోనే ప్యాన్ ఇండియా రేంజ్ మూవీ నిర్మించారు కృష్ణంరాజు గారు. హీరోగానే కాకుండా మల్టీ స్టారర్స్ లో, సపోర్టింగ్ రోల్స్ ఎన్నో చేశారు కృష్ణంరాజు. చిరంజీవి మనవూరి పాండవులు, బాలకృష్ణ సుల్తాన్ – వంశోద్ధారకుడు, వెంకటేష్ టూ టౌన్ రౌడీ, నాగార్జున నేటి సిద్దార్థలతో పాటు ఇప్పటి యంగ్ జెనెరేషన్ నితిన్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళతోనూ నటించిన అపార అనుభవం ఆయనది.
సూపర్ స్టార్ కృష్ణతో ఎక్కువగా స్క్రీన్ షేరింగ్ జరిగింది. రాజకీయాల్లోనూ కృష్ణంరాజుగారు రాణించారు. 1991 కాంగ్రెస్, 1999లో బీజేపీలో కీలక పాత్ర పోషించి వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్రమంత్రిగానూ సేవలు అందించారు. ప్రజారాజ్యంలో కొంతకాలం ఉన్నారు. ఇంత గొప్ప ప్రస్థానం కలిగిన కృష్ణంరాజు కన్నుమూయటం పరిశ్రమకే కాదు సినీ ప్రేముకులందరికీ తీరని లోటు
This post was last modified on September 11, 2022 9:02 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…