ఉప్పెన రూపంలో తొలి సినిమాతోనే సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టికి ఆ తర్వాత సక్సెస్ ట్రాక్ కొనసాగింది. నానితో చేసిన శ్యామ్ సింగ రాయ్ హిట్ క్యాటగిరీలో పడగా సంక్రాంతి బరిలో దిగిన బంగార్రాజుతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. హ్యాట్రిక్ అయితే పూర్తి చేసింది కానీ రీసెంట్ గా దక్కిన రెండు సూపర్ ఫ్లాపులు తనను డిస్టర్బ్ చేసిన మాట వాస్తవం. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఎంతో ముచ్చటపడి చేసిన ది వారియర్, నితిన్ తో జతకట్టిన మాచర్ల నియోజకవర్గం మరీ దారుణంగా డిజాస్టర్స్ కొట్టి తీవ్రంగా నిరాశపరచడం కేవలం నెల రోజుల గ్యాప్ లో జరిగిపోయాయి.
అందుకే ఇప్పుడు ఆశలన్నీ ఈ నెల 16న రాబోతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మీదే పెట్టుకుంది. హీరోయిన్లను కళాత్మకంగా చూపిస్తాడని పేరున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఏకంగా తన మీదే టైటిల్ పెట్టడంతో ఒకవేళ క్లిక్ అయితే మాత్రం మార్కెట్ అమాంతం పెరిగిపోతుందనే నమ్మకంతో ఉంది. వీటి సంగతి కాసేపు పక్కనపెడితే కృతి శెట్టి ప్రస్తుతం నాగ చైతన్యతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు టేకప్ చేసిన ఈ ప్రాజెక్ట్ మీద అక్కినేని ఫ్యాన్స్ కు ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి.
తాజాగా అందిన ఒక లీక్డ్ అప్డేట్ ని బట్టి ఇందులో బేబమ్మ హారర్ టచ్ ఉన్న ఆత్మ పాత్రలో కనిపిస్తుందట. అయితే దెయ్యం కాదని ఓ విభిన్న నేపథ్యంలో స్పెషల్ గా డిజైన్ చేసిన క్యారెక్టరని ఇన్ సైడ్ టాక్. మెయిన్ హీరోయిన్ తనే కాబట్టి ఏదో ట్విస్టు ఉండే ఉంటుంది. అఫీషియల్ ఇన్ఫో కాదు కాబట్టి పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియలేదు. తండ్రి కొడుకులు మాస్ట్రో ఇళయరాజా యువన్ శంకర్ రాజా సంయుక్తంగా సంగీతం అందిస్తున్నఈ మూవీతో పాటు సూర్య సరసన కృతిశెట్టి అచలుడు చేస్తోంది. శివపుత్రుడు ఫేమ్ బాలా డైరెక్షన్ కావడంతో ఇదీ స్పెషల్ గానే నిలవనుంది
This post was last modified on September 10, 2022 10:32 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…