తరచుగా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయకపోతే వార్తల్లో నిలవకపోతే కంగనా రనౌత్ కు నిద్రపట్టదు ఏమో. తాజాగా ఆమె అత్యుత్సాహం తన పరువు తానే తీసుకునేలా చేసింది. ఈ శుక్రవారం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాకు ముందు నుంచి ఉన్న హైప్ వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. తొలి రోజు జనం సినిమా కోసం ఎగబడ్డారు. కంగనా ఇవేవీ పట్టించుకోకుండా సినిమా పెద్ద డిజాస్టర్ అని తేల్చేసింది. సుమిత్ కడెల్ అనే బాలీవుడ్ క్రిటిక్ బ్రహ్మాస్త్ర మూవీకి సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చినట్లు, సినిమాను తీవ్రంగా విమర్శించినట్లు ఒక ట్వీట్ను పోస్ట్ చేసింది.
కానీ అసలు విషయం ఏమిటంటే కంగనా కోట్ చేసిన ట్విట్టర్ అకౌంట్ ఫేక్. అది సుమిత్ అకౌంట్ కాదు. నిజానికి సుమిత్ బ్రహ్మాస్త్ర మూవీ కి త్రీ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. సినిమాను కొనియాడాడు. అయితే రివ్యూలు ఎలా ఉన్నాయి అన్నది పక్కన పెడితే బ్రహ్మాస్త్రకు తొలి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా ఇండియా వరకే 43 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్ కలెక్షన్ 75 కోట్ల రూపాయల దాకా వచ్చింది. శనివారం కూడా బుకింగ్స్ బాగున్నాయి. ఆదివారం కూడా వసూళ్లకు డోకా లేకపోవచ్చు. కాబట్టి కంగనా చెప్పినట్లు బ్రహ్మాస్త్ర డిజాస్టర్ అయ్యే అవకాశాలు లేవు. దీంతో ఆమె వాదన తుస్సుమన్నట్లే.
ఇంకోవైపు ఏమో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ పోస్టు షేర్ చేస్తూ సినిమాను విమర్శించడం వల్ల ఆ రకంగానూ ఆమె పరువు పోయింది. అయినా ఈమధ్య ధకడ్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఘోరపరాభవం ఎదుర్కొన్న కంగనా.. మంచి వసూళ్లు సాధిస్తున్న వేరే సినిమా మీద ఏడవడం ఏంటో?
This post was last modified on September 10, 2022 3:27 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…