Categories: Movie News

ట్విట్టర్లో కథ అల్లేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్లు

‘హిట్’ సినిమాతో టాలీవుడ్లోకి దర్శకుడిగా సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు శైలేష్ కొలను. పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ కూడా అందుకున్న ఈ శాస్త్రవేత్త సినిమాల మీద విపరీతమైన ఆసక్తితో తన కెరీర్‌ను వదులుకుని ఇటువైపు అడుగులేశాడు. ‘హిట్’ సినిమాను పకడ్బందీగా తీసి, హిట్టు కొట్టి ఫిలిం ఇండస్ట్రీ వైపు రావడం సరైన నిర్ణయమే అని చాటిచెప్పాడు.

ఇప్పుడతను నాని కోసం ఓ కథ రాస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మధ్యలో ఓ సినిమా చేశాక.. ‘హిట్’ సీక్వెల్ తీస్తాడంటున్నారు. శైలేష్‌కు థ్రిల్లర్ కథల మీద ఉన్న పట్టేంటో తొలి సినిమాతోనే రుజువైంది. తర్వాతి సినిమా కూడా ఆ జానర్లోనే ఉండొచ్చంటున్నారు. ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ వేళ తన కొత్త సినిమాకు కథ రాసుకుంటూనే.. ట్విట్టర్లో సరదాగా వేరే దర్శకులను ఎంగేజ్ చేస్తూ ఓ కథను డెవలప్ చేసే ప్రయత్నంలో పడ్డాడు శైలేష్.

ఓ థ్రిల్లర్ కథకు ట్విట్టర్ ద్వారా శ్రీకారం చుట్టి.. ఈ కథను ఇంకా ముందుకు తీసుకెళ్లమంటూ టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్లను లైన్లోకి తీసుకొచ్చాడతను. ముందుగా శైలేష్ మొదలు పెట్టిన కథ ఎలా ఉందో చూద్దాం. విఘ్నేష్ అనే 42 ఏళ్ల వ్యక్తి తెల్లవారుజామున 5.30 నిమిషాలకు ఇంటి వెనుక నుంచి వచ్చిన పెద్ద శబ్దం విని నిద్ర లేస్తాడు. లివింగ్ రూం ద్వారా వెళ్లి వెనుక డోర్ తీస్తాడు.

ఇక్కడి నుంచి కథను కొనసాగించమంటూ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ను అతను ఛాలెంజ్ చేశాడు. అతనేమో.. ‘‘దూరం నుంచి తన భార్య అరుపు విన్నాడు. విఘ్నేష్ పరుగెత్తుకుని వెళ్లగా.. భార్యను ముగ్గురు మహిళలు బలవంతంగా కారులోకి ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యం కనిపించింది. వాళ్లు ఎక్కింది పచ్చ రంగు వింటేజ్ కారు. దాని మీద ప్రీతి అని రాసి ఉంది’’.. అంటూ తన వరకు కథను డెవలప్ చేసి ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహాకు ఛాలెంజ్ విసిరాడు.

అతను ఇంకొంత కథను ముందుకు తీసుకెళ్లి ఇంద్రగంటి మోహనకృష్ణకు అప్పగించాడు. ఆయన ఇంకాస్త కథను డెవలప్ చేసి అసవరాల శ్రీనివాస్‌కు కొనసాగించే పని అప్పగించాడు. అక్కడితో బ్రేక్ పడింది. అవసరాల ఇంకా స్పందించలేదు. ఇప్పటిదాకా కథ మంచి షేప్ తీసుకుందని.. అవసరాల ఏం చేస్తాడో చూద్దామని శైలేష్ తాజాగా ట్వీట్ చేశాడు. వీళ్లు ఇలా డెవలప్ చేసిన కథను సరదాగా సినిమా కూడా తీసి పడేస్తారేమో చూడాలి మరి.

This post was last modified on April 22, 2020 1:42 pm

Share

Recent Posts

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

2 minutes ago

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

33 minutes ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

35 minutes ago

ఇకపై జగన్ రోజూ కోర్టుకు వెళ్లాల్సిందేనా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…

2 hours ago

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

5 hours ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

6 hours ago