మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయబోయే సినిమాల్లో ముందు దర్శకుడు శంకర్ ది ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య షూటింగ్ కు కొంత బ్రేక్ ఇచ్చాక ఇటీవలే హైదరాబాద్ లో రీ స్టార్ట్ చేశారు. ఎస్ జె సూర్య తాజా షెడ్యూల్ లో అడుగు పెట్టాడు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ సాధించాక ఆచార్య డిజాస్టర్ తో డీలా పడిన ఫ్యాన్స్ కు దీని మీద మాములు అంచనాలు లేవు. శంకర్ భీభత్సమైన ఫామ్ లో లేకపోయినా ఆయన కసి మీద తీస్తుంటాడనే నమ్మకం వాళ్లలో కనిపిస్తోంది. ఓ పాట తాలూకు కొన్ని ఫోటోలు వీడియో లీక్ కావడం పట్ల దిల్ రాజు టీమ్ ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉండగా దీని తర్వాత చేయబోయే చరణ్ 16వ సినిమా గురించి కొత్త ప్రచారాలు తెరమీదకు వస్తున్నాయి. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరికి ఆల్రెడీ కమిట్ మెంట్ ఇవ్వడం పాత న్యూస్. ఫైనల్ వెర్షన్ ఇంకా పూర్తి సంతృప్తిగా రాలేదని ఇంకొంత ఆలస్యం కావొచ్చనే మాట కూడా వినిపిస్తోంది. తాజాగా శాండల్ వుడ్ దర్శకుడు నర్తన్ ఇటీవలే చరణ్ ని కలిసి ఒక లైన్ వినిపించాడట. అది తనకు నచ్చిందని మళ్ళీ కలిసినప్పుడు పూర్తిగా విని అప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు మెగా కాంపౌండ్ న్యూస్. సినిమా కన్ఫర్మ్ కాలేదన్నది నిజం.
ఈ నర్తన్ కన్నడలో మఫ్టీ అనే బ్లాక్ బస్టర్ తీశాడు. శివరాజ్ కుమార్ శ్రీమురళి కాంబోలో ఇది పెద్ద విజయం సాధించింది. తర్వాత యష్ ని ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించాడు కానీ అది ముందుకు సాగలేదు. కెజిఎఫ్ నుంచి యష్ మరీ ఆచితూచి అడుగులు వేయడంతో ఈలోగా నర్తన్ చరణ్ ఓ మీటింగ్ చేసుకున్నాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. 2023 వేసవి కన్నా ముందు శంకర్ మూవీ రిలీజయ్యే ఛాన్స్ లేదు కాబట్టి అభిమానులు ఇంకో ఏడెనిమిది నెలలు ఎదురు చూడక తప్పదు. ఈలోగా దీంతో పాటు ప్రాజెక్ట్ 16 తాలూకు అప్డేట్స్ ని రెగ్యులర్ గా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు .
This post was last modified on September 10, 2022 2:31 pm
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…