చాలా గ్యాప్ తర్వాత మంచు విష్ణు సోలో హీరోగా నటించిన సినిమా జిన్నా వచ్చే నెల విడుదలకు రెడీ అవుతోంది. నిన్న హైదరాబాద్ ఏఎంబి మల్టీప్లెక్స్ లో టీజర్ లాంచ్ ఈవెంట్ లో కాస్త గట్టిగానే హడావిడి చేశారు. ఓ పల్లెటూళ్ళో టెంట్ హౌస్ నడుపుకునే జులాయి కుర్రాడికి ఊరంతా అప్పులుంటాయి. అప్పుడు అతగాడి జీవితంలోకి బయటి నుంచి వచ్చిన ఓ అమ్మాయి ప్రవేశిస్తుంది. చిన్ననాటి స్నేహితురాలికీ ఇతని మీద లవ్ ఉంటుంది. కట్ చేస్తే కథలో హారర్ కోణం. భయపడేలోగా మాస్ ఫ్యాన్స్ కోసం ఓ ఫైట్. ఇలా ఒక కమర్షియల్ మీటర్ మీద జిన్నా సాగినట్టు క్లారిటీ ఇచ్చేశారు.
ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా భారం మొత్తం సన్నీ లియోన్ మీద ఉందన్న తరహాలో విష్ణుతో పాటు రచయిత కోన వెంకట్ తదితరులు ఇచ్చిన ఎలివేషన్లు మాములుగా లేవు. కథ రాసుకున్నాక సన్నీ డేట్లు తీసుకుని ఆ తర్వాత తనకు వినిపించేందుకు వచ్చారని విష్ణు చెప్పడం పెద్ద ట్విస్టు.
అంతేకాదు తాను మారిస్తే బాగుంటుందేమోనని ఆలోచిస్తే ఈ పాత్ర సన్నీకి తప్ప ఇంకెవరికి సూట్ కాదని, కొందరు మీడియా మిత్రుల అభిప్రాయాలు తీసుకున్నాక ఫైనల్ గా ఓకే చెప్పానని అన్నాడు. ఈ లెక్కన సన్నీ లియోన్ (Sunny Leone) క్యారెక్టర్ కి చాలా వెయిట్ ఉందనే విషయం అర్థమైపోయింది.
అక్టోబర్ 5న గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లతో జిన్నా పోటీ పడొచ్చనే టాక్ వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం దసరా లేదా దీపావళి ఏదో ఒకటి డిసైడ్ చేసి త్వరలో చెబుతామని హింట్ ఇస్తున్నారు. ఆ మధ్య గ్యాంగ్ స్టర్ గంగరాజు తీసిన సూర్య ఈ సినిమాకు దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతంతో పాటు చమ్మక్ చంద్ర సద్దాంల కామెడీ, రఘుబాబు, సునీల్, నరేష్ లాంటి సీనియర్ క్యాస్టింగ్ తో ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు.
రొటీన్ ఫ్లేవర్ అనిపిస్తున్నా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని విష్ణు చాలా నమ్మకంగా చెబుతున్నాడు. ఆరెక్స్ 100 తర్వాత అంత హిట్టు లేని పాయల్ రాజపుత్ కు హీరోయిన్ గా జిన్నా అయినా బ్రేక్ ఇస్తాడేమో చూడాలి.
This post was last modified on September 10, 2022 10:41 am
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…