తారలకు కొన్ని జ్ఞాపకాలు సినిమాలతో ముడిపడినవే అయినా అందంగా అలా గుర్తుండిపోయేలా ఉంటాయి. సెప్టెంబర్ 9 అక్కినేని నాగార్జున అమలకు ఇద్దరికీ అలాగే నిలిచిపోనుంది. ఒకే రోజు వీళ్ళు నటించిన వేర్వేరు సినిమాలు రిలీజ్ కావడం ఇందులో ప్రధాన విశేషం. బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివలో నాగ్ చాలా కీలకమైన పాత్ర పోషించగా ఒకే ఒక జీవితంలో అమల శర్వానంద్ తల్లిగా కథ తన చుట్టూ తిరిగే ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని సొంతం చేసుకున్నారు. కింగ్ కు అది బాలీవుడ్ కంబ్యాక్ కాగా అమలకు సైతం తెలుగులో అదే జరుగుతోంది.
ఒకప్పుడు ఈ జంట ఎంత కనువిందు చేసిందో అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. ముఖ్యంగా తెలుగు సినిమా గమనాన్ని మార్చిన శివ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేమయుద్ధం ఫ్లాప్ అయినా వీళ్ళ కెమిస్ట్రీ సూపర్ హిట్. కిరాయిదాదా, చినబాబు చిత్రాల్లో క్యూట్ గా కనిపించిన పెయిర్ ఇధి. ఆఖరిసారి నిర్ణయంలో నవ్వించి కవ్వించి మెప్పించాక నిజ జీవితంలో భార్యాభర్తలయ్యారు. ఆ తర్వాత అమల నటనకు స్వస్తి చెప్పడం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో రీ ఎంట్రీ ఇచ్చాక ఒకే సినిమాలో కలిసి నటించే ఛాన్స్ రాకపోవడం జరిగాయి.
ఇప్పుడూ కాంబోగా చేయలేదు కానీ ఇలా ఒకే డేట్ కి క్లాష్ అవ్వడం మాత్రం స్వీట్ మెమరీనే. చైతు అఖిల్ ఫ్యాన్స్ దీని గురించే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ అమ్మ సినిమాకెళదామా డాడీ మూవీ చూద్దామా అంటూ సరదాగా చర్చించుకున్నారు. కాకతాళీయంగా బ్రహ్మాస్త్ర, ఒకే ఒక జీవితం రెండూ షూటింగుతో పాటు రిలీజ్ వ్యవహారాలు చాలా ఆలస్యంగా జరుపుకున్నవి. బడ్జెట్ పరంగా పోలిక లేకపోయినా విడుదల విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదురుకున్నవే. రెండింటికి పాజిటివ్ టాక్ వినిపిస్తుండటం శుభ సూచకం. మరి అందరి నుంచే అదే మాట వస్తుందా చూద్దాం.
This post was last modified on September 9, 2022 8:57 am
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…