సినీ రంగంలో చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ కొద్దిమంది మాత్రమే తమ స్నేహ బంధం ఎంత గాఢమైందో బహిరంగ వేదిక మీద చాటుతుంటారు. మోహన్ బాబు రజినీకాంత్ ప్రస్తావన వస్తే ఎప్పుడూ కూడా ఒరేయ్, వాడు అనే సంబోధిస్తుంటాడు. కానీ రజినీ మాత్రం ఇలా మాట్లాడడు.
ఇక టాలీవుడ్ యువ కథానాయకుల్లో చాలామంది ఒకరినొకరు రేయ్ అని పిలుచుకుంటుంటారు కానీ.. వేదికల మీద చాలా వరకు ఒకరినొకరు మర్యాదగానే సంబోధిస్తారు. ఐతే యంగ్ హీరో శర్వానంద్ మాత్రం.. తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వెన్నెల కిషోర్‌ను తన కొత్త చిత్రం ఒకే ఒక జీవితం ప్రెస్ మీట్ సందర్భంగా సంబోధించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్రంలో కిషోర్ కూడా ముఖ్య పాత్ర పోషించగా.. వేరే షూటింగ్ ఉండడం వల్ల ఈ ఈవెంట్‌కు రాలేకపోయాడు.
ఐతే కారణమేదైనప్పటికీ కిషోర్ ఈ కార్యక్రమానికి రాకపోవడంతో శర్వాకు కోపం వచ్చింది. కానీ అది ప్రేమతో కూడిన కోపమే. అతను రాకపోవడంపై స్పందిస్తూ.. ఆ నా కొడుకు అయిపోయాడు. ఒరే వెన్నెల కిషోర్‌గా నీ సంగతి చూస్కుంటా. వాడికి ఈ సినిమా ఇప్పించింది కూడా నేనే. కానీ వాడు ఈ ఈవెంట్‌కు రాలేదు అన్నాడు. కాకపోతే మాటల్లో ఉన్నంత తీవ్రత ముఖంలో కనిపించలేదు. శర్వా నవ్వుతూనే ఈ మాటలు అన్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కిషోర్ వెంటనే స్పందించాడు. రామోజీ ఫిలిం సిటీలో నైట్ షూట్‌లో ఉన్నానని.. కాబట్టే రాలేకపోయానని.. లవ్ యు శర్వా అని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా.. ఒకే ఒక జీవితం సినిమా తనకు చాలా స్పెషల్ అని.. ఆ సినిమాను ఎంతగానో నమ్మి చేశామని.. కచ్చితంగా ఓ మంచి సినిమాను అందిస్తున్నామని ప్రేక్షకులకు ప్రామిస్ చేస్తున్నానని.. డిజప్పాయింట్ చేయనని శర్వా ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on September 8, 2022 6:22 pm
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…