సూపర్ స్టార్ రజినీ సినిమా వేడుకలకు రావడం.. వచ్చినా ఎక్కువ మాట్లాడడం తక్కువ. కానీ మాట్లాడాడంటే ఆయన ప్రసంగాలు చాలా ఆసక్తికరంగా, ఎంటర్టైనింగ్‌గా ఉంటాయి. రోబో రిలీజ్ టైంలో తన మీద తాను జోకులు వేసుకుంటూ.. ఐశ్వర్యారాయ్‌కి ఎలివేషన్ ఇస్తూ చేసిన ప్రసంగం బ్లాక్‌బస్టర్ అనే చెప్పాలి. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ ఉంటుంది.
తాజాగా పొన్నియన్ సెల్వన్ ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథుల్లో ఒకడిగా వచ్చిన రజినీ.. దాన్ని మించిన ఎంటర్టైనింగ్ స్పీచ్‌తో అందరి కడుపులు చెక్కలయ్యేలా చేశాడు. మణిరత్నంతో తాను చేసిన దళపతి సినిమా అనుభవాల గురించి ఆయన చాలా ఆసక్తికర విషయాలు చెప్పాడీ ప్రసంగంలో.
దళపతి సినిమా షూట్ రేపు అనగా తాను ముందు రోజు ముంబయిలో ఒక హిందీ ఫిలిం షూటింగ్ ముగించుకుని అర్ధరాత్రి వచ్చానని.. ఉదయం షూట్ కోసం రెడీ అవుతుండగా మేకప్ మ్యాన్‌ను మేకప్ వేయమని అడగ్గా.. తన పాత్రకు మేకప్ అవసరం లేదని చెప్పాడన్నాడు.
ఐతే మమ్ముట్టి కాంబినేషన్లో సీన్ చేయాల్సి ఉండగా.. అతను యాపిల్లాగా ఉంటాడని, తనతో కలిసి మేకప్ లేకుండా సీన్ చేస్తే అమావాస్య-పౌర్ణమి లాగా ఉంటుందని చెప్పి సింపుల్‌గా అయినా మేకప్ వేయమని చెప్పినట్లు రజినీ అనగానే ఆడిటోరియం గొల్లుమంది. ఇక తన కోసం తెచ్చిన డ్రెస్ లూజుగా ఉండడంతో టైలర్‌కు చెప్పి టైట్ చేయించానని.. మేకప్, ఆ డ్రెస్ వేసుకుని సెట్‌కు వెళ్లగా మణిరత్నంతో పాటు అందరూ ఆశ్చర్యంగా చూశారని.. అంతలో శోభన వచ్చి ఈ సినిమా నుంచి నిన్ను తీసేసి కమల్ హాసన్‌ను పెట్టాలని మాట్లాడుకుంటున్నారని తనను టెన్షన్ పెట్టేలా మాట్లాడిందని రజినీ వెల్లడించాడు.
ఇక షూటింగ్ సందర్భంగా తాను ఏ సీన్‌కు ఏ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినా మణిరత్నంకు నచ్చలేదని.. ప్రతి సీన్‌కు 10-12 టేక్‌లు పట్టేవని.. దీంతో ఏం చేయాలో అర్థం కాక కమల్‌కు ఫోన్ చేశానని రజినీ తెలిపాడు. ఇలా అవుతుందని తాను ముందే ఊహించానని చెప్పిన కమల్.. ఏ సీన్ అయినా ముందు మణిరత్నంనే నటించి చూపించమని అడిగి, ఆయన ఎలా చేస్తే అలా చేసేయమని సలహా ఇచ్చాడని.. తాను అదే ఫాలో అయిపోవడంతో గట్టెక్కిపోయానని రజినీ తెలిపాడు. ఇదంతా రజినీ చెబుతుండగా.. కమల్ ఆయన పక్కనే ఉండడం.. మణిరత్నం సహా ఆడిటోరియంలో ఉన్న వారంతా కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోవడం విశేషం.
This post was last modified on September 8, 2022 6:17 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…