పొన్నియన్ సెల్వన్ 1 ట్రైలర్ వచ్చినప్పటి నుంచి తమిళ సోదరుల అత్యుత్సాహం మాములుగా లేదు. ఈ పిఎస్ 1 ఒక ఎత్తు బాహుబలితో సహా నార్త్ నుంచి సౌత్ దాకా ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చినవన్నీ మరో ఎత్తు అనేలా విపరీతమైన ట్విట్లు, పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు, విక్రమ్ గుర్రం మీద వచ్చే ఓ సీన్ ని పెట్టేసి దీన్ని మించిన షాట్ చూపించమంటూ ఇతర హీరోల ఫ్యాన్స్ ని కవ్వించడం మొదలుపెట్టారు. నిన్నటి దాకా విజయ్ వర్సెస్ మహేష్ అభిమానుల మధ్య ఉన్న వార్ కాస్తా ఇప్పుడు దీనికి షిఫ్ట్ అయిపోయింది. అలా అని మనవాళ్ళు ఊరుకుంటారా.
రాజమౌళి తీసిన సినిమాల వీడియో క్లిప్పులు స్క్రీన్ షాట్లు పెట్టి ఇలాంటిది గతంలో అయినా ఇప్పుడైనా ఒక్కటి చూపించమంటూ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. నిజానికి విడుదల కాకుండా కేవలం మూడు నిమిషాల ట్రైలర్ చూసి బాహుబలి కన్నా తోపు అని చెప్పుకోవడం కొంత శృతి మించిన వ్యవహారమే. మణిరత్నం గొప్ప విజనరీ ఉన్న దర్శకులే. ఇది జక్కన్నతో సహా అందరూ ఒప్పుకునే నిజం. శంకర్ అంతటి వాడే పబ్లిక్ స్టేజి మీద నేను గీతాంజలి చూసి స్ఫూర్తి చెంది ఇండస్ట్రీకి వచ్చానని పబ్లిక్ గా చెప్పారు. అలాంటిది ఆయన గురించి కొత్తగా సర్టిఫికెట్ అక్కర్లేదు.
ఎటొచ్చి మణిసార్ తన మేజిక్ టచ్ కోల్పోయి ఏళ్ళు గడిచిపోయింది. దీంతోనే కంబ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. పిఎస్ 1లో ఎంత విజువల్ గ్రాండియర్ నెస్ ఉన్నా ఎమోషన్స్ మాత్రం అంత గొప్పగా లేవేమోననే అనుమానం కలిగించాయి. పైగా చోళుల బ్యాక్ డ్రాప్ తమిళసీమకు చెందినది. దేశవ్యాప్తంగా దీన్ని ఆడియన్స్ అందరూ అంగీకరిస్తారానేది భావోద్వేగాలను, ఎలివేషన్లను మణి ఎలా చూపించారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప రెండు భాగాలు తీశారనో, వందల కోట్లు పెట్టరనో జనం సానుభూతి ఎందుకిస్తారు.అది వదిలేసి బాహుబలి అవుట్ రాజమౌళి అవుటని చెప్పడం కామెడీ కాక మరేమిటి.
This post was last modified on September 8, 2022 9:38 am
ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ…
పెళ్లి రద్దయిన తర్వాత స్మృతి మంధాన మానసికంగా కృంగిపోతారని, కొన్నాళ్ళు బయట కనిపించరని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె అందరి…
గ్రామ పంచాయతీలపై జనసేన పార్టీ పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలను…
అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…
హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…
అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…