మూడు దశాబ్దాలకు పైగా సాగిన ఉజ్వల కెరీర్లో ఆమిర్ ఖాన్‌కు లాల్ సింగ్ చడ్డాను మించిన షాక్ ఇంకొకటి ఉండదేమో. అతడి కెరీర్లో ఫ్లాపులు, డిజాస్టర్లు లేకపోలేదు కానీ.. విడుదలకు ముందే ఇది డిజాస్టర్ అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేయడం, ఈ సినిమా పట్ల ఏమాత్రం ఆసక్తి చూపించకపోవడం ఆమిర్‌ను పెద్ద షాక్‌కు గురి చేసి ఉంటుంది. తొలి రోజు జనాలు లేక 1300కు పైగా షోలు క్యాన్సిల్ అయ్యాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు.
ప్రేక్షకులకు తన మీద ఇంత వ్యతిరేక భావం ఎందుకు వచ్చిందో ఆమిర్‌కు కూడా అర్థం కాకపోయి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఆమిర్ కొంత కాలం బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమాకు నష్టాలు తగ్గించడం, కొంత మేర తనే భరించడం మీద ఇప్పుడు ఆయన దృష్టి నిలిచి ఉంది.
తన పారితోషకం మొత్తం వదులుకుని ఈ సినిమాకు మేజర్ బడ్జెట్ పెట్టిన వయాకామ్ 18 వాళ్లను ఆమిర్ ఆదుకునే ప్రయత్నంలో ఉన్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాక ఓటీటీ డీల్ విషయంలో ఇంతకుముందు ఉన్న ఆలోచనను ఆమిర్ పక్కన పెట్టేశాడని సమాచారం. లాల్ సింగ్ చడ్డా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఆరు నెలలకు ఓటీటీలో వస్తుందని.. త్వరగా డిజిటల్ రిలీజ్ చేసి తాత్కాలిక ప్రయోజనం పొందితే, దీర్ఘ కాలంలో పెద్ద నష్టం జరుగుతుందని విడుదలకు ముందు ఆమిర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ థియేటర్లలో సినిమాకు దారుణ పరాభవం ఎదురవడంతో ఇప్పుడు మొత్తం కథ తలకిందులైంది.
ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి తెస్తే దాన్ని తీసుకోవడానికి ఏ ఫ్లాట్ ఫ్లామ్ కూడా ముందుకు రాకపోవచ్చు. అందుకే అక్టోబరులోనే డిజిటల్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారట. ముందు అంచనా వేసిన దాని కంటే తక్కువ మొత్తానికి నెట్ ఫ్లిక్స్ వాళ్లతో ఒప్పందం జరిగిందని.. త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారని సమాచారం. అనివార్య పరిస్థితుల్లో ఆమిర్ తన సినిమా డిజిటల్ రిలీజ్ విషయంలో మాట తప్పాల్సి వస్తోంది.
This post was last modified on September 8, 2022 9:33 am
ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ…
పెళ్లి రద్దయిన తర్వాత స్మృతి మంధాన మానసికంగా కృంగిపోతారని, కొన్నాళ్ళు బయట కనిపించరని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె అందరి…
గ్రామ పంచాయతీలపై జనసేన పార్టీ పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలను…
అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…
హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…
అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…