బాహుబలి మూవీతో ప్రభాస్ తిరుగులేని ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించాడన్న ఆనందం బాగానే ఉంది కానీ.. వాటిని నిలబెట్టుకునే సినిమాలు తర్వాత అతడి నుంచి రాకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఇదొక బాధ అయితే ప్రభాస్ చేస్తున్న సినిమాలకు సరైన ప్రమోషన్లు లేకపోవడం, సమయానుకూలంగా అప్ డేట్స్ ఇవ్వకపోవడం వారిని మరింత బాధిస్తున్న విషయం. సాహో, రాధేశ్యామ్ రెండు చిత్రాల విషయంలోనూ ఇలాగే జరిగి యువి క్రియేషన్స్ వాళ్ల మీద ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
బాలీవుడ్ వాళ్లు ప్రమోషన్లలో బాగా ముందుంటారు కాబట్టి ఆదిపురుష్ విషయంలోనైనా హడావుడి కనిపిస్తుందేమో అనుకుంటే.. అక్కడ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సినిమా మొదలై, షూటింగ్ పూర్తయి చాలా కాలం అయినా ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేయలేదు.
ఈ విషయంలో ఇప్పటికే తీవ్ర నిరాశకు గురైన ప్రభాస్ ఫ్యాన్స్ అక్టోబరు 23న తమ కథానాయకుడి పుట్టిన రోజుకైనా ఫస్ట్ లుక్ వస్తుందేమో అన్న ఆశతో ఉన్నారు. ఇదే విషయాన్ని ముంబయిలో మీడియా కంట పడ్డ దర్శక నిర్మాత ఓం రౌత్‌ను అడగ్గా.. అతను తీపి కబురు చెప్పాడు. ప్రభాస్ పుట్టిన రోజుకు కచ్చితంగా ట్రీట్ ఉంటుందని.. అది జస్ట్ ఫస్ట్ లుక్ కాదని అతను సంకేతాలు ఇచ్చాడు. చాలా పెద్ద ట్రీటే ఉంటుందని.. అభిమానులు చాలా సంతోషించేలా అది ఉంటుందని అతను చెప్పాడు.
ఈ వీడియో చూసి ప్రభాస్ అభిమానులు అమితానందానికి గురవుతున్నారు. బహుశా ప్రభాస్ బర్త్ డేకి ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జనవరి 11న సినిమా రిలీజ్ కావాల్సి ఉన్న నేపథ్యంలో టీజర్ లాంచ్‌కు ఇది సరైన టైమింగే అని భావిస్తున్నారు.
This post was last modified on September 8, 2022 9:30 am
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…