ఎదురుచూసే కొద్దీ ఆలస్యమవుతూనే ఉన్న మహేష్ బాబు కొత్త సినిమా షూటింగ్ ఎట్టకేలకు మొదలు కాబోతోంది. ఈ నెల 12న అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్లో హీరోతో పాటు ఇతర కీలక తారాగణం పాల్గొనగా మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఫైట్ ఎపిసోడ్ తో త్రివిక్రమ్ కెమెరాకు పని చెప్పబోతున్నారు. సందేశాలు వగైరాలు ఏమీ లేకుండా యాక్షన్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ తో పక్కా పైసా వసూల్ మూవీగా మాటల మాంత్రికుడు దీన్ని తీర్చిదిద్దుతారని ఇన్ సైడ్ టాక్. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో ఆయన మీదే అంచనాల బరువుంది.
దీనికోసమే ప్రత్యేకంగా హెయిర్ స్టైల్ తో పాటు మీసం పెంచిన మహేష్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇటీవలే నటించిన యాడ్స్, ఓ టీవీ ప్రోగ్రాంకు గెస్ట్ గా వెళ్ళినప్పుడు ఆ లుక్ కు సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చేసింది. మహర్షి తర్వాత అంతకు మించిన కూల్ అండ్ యూత్ ఫుల్ అవతారంలో సూపర్ స్టార్ రచ్చ మాములుగా ఉండేలా కనిపించడం లేదు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో కథానాయకి ఉంటుందన్నారు కానీ అదెవరో మాత్రం లీక్ కాలేదు. అయిదారు పేర్లు వినిపించాయి కానీ అసలు సీక్రెట్ గుట్టుగానే ఉంది.
శ్రీలీల దగ్గర లాక్ అయ్యారని ప్రచారం జరిగినా అదీ నిర్ధారణ కాలేదు. మహేష్ కి ఇది బ్లాక్ బస్టర్ కావడం చాలా అవసరం. మంచి మాస్ సెటప్ చేసిన సర్కారు వారి పాట హంగామా అయితే చేసింది కానీ ఆశించిన స్థాయిలో వసూళ్ల రికార్డులు రాలేదు. సరిలేరు నీకెవ్వరు హిట్ అయినా ఒక్కడు, పోకిరి రేంజ్ ని అభిమానులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. గతంలో అతడు, ఖలేజాలు త్రివిక్రమ్ మహేష్ లు కోరుకున్న రేంజ్ లో మేజిక్ చేయలేకపోయాయి. ఆ లోటుని ఇది పూర్తిగా తీర్చాలనే పట్టుతో ఉన్నారు. తమన్ నుంచి కూడా కిక్ యాస్ ఆల్బమ్ బాకీ ఉంది. చూద్దాం
This post was last modified on September 8, 2022 9:24 am
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…