Movie News

చిన్న సినిమా .. తగ్గేదెలే

వచ్చే దసరాకి రెండు బడా సినిమాలు రిలీజవుతున్న సంగతి తెలిసిందే. మెగా స్టార్ ‘గాడ్ ఫాదర్’ , నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమాలు విజయదశమి స్పెషల్ గా విడుదలవుతూ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి.రెండు సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేసేశారు. నాగార్జున ‘ది ఘోస్ట్’ ట్రైలర్ కూడా వచ్చేసింది. ‘గాడ్ ఫాదర్’ రిలీజ్ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందా ? అనే సందేహానికి మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చి దసరా కి రావడం పక్కా అని మరోసారి చెప్పారు. అయితే ఈ రెండు సినిమాలతో పాటు అదే రోజు ఓ చిన్న సినిమా కూడా వస్తుంది. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన ‘స్వాతి ముత్యం’ అక్టోబర్ 5న థియేటర్స్ లోకి రానుంది.

కొన్ని రోజుల క్రితమే మేకర్స్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి ప్రమోషన్స్ మొదలు పెట్టారు. కానీ రెండు బడా సినిమాలు పోటీలో నిలిచే సరికి ఈ చిన్న సినిమా పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ కుర్ర హీరో మాత్రం తగ్గేదే లే అంటూ ముందుకొస్తున్నాడు. నిజానికి దసరా అంటే సినిమాల సీజన్.. రెండు , మూడు సినిమాలు ఆడే వీలుంటుంది. కానీ చిరు -నాగ్ సినిమాల పక్కన ఈ చిన్న సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించి థియేటర్స్ కి వస్తారా ? అనేదే డౌట్.

ప్రస్తుతానికి మేకర్స్ మాత్రం చెప్పిన రిలీజ్ డేట్ కే స్టిక్ అయి ఉన్నారు. అదే డేట్ తో ప్రమోషన్స్ స్పీడ్ కూడా పెంచేశారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు. చెప్పుకోవడానికి ఇది చిన్న సినిమానే కావొచ్చు. కానీ పెద్ద బేనర్ నుండి వస్తున్నసినిమా. అందుకే నిర్మాత ఎక్కడా తగ్గడం లేదు. దసరా సీజన్ లో తమ సినిమాకు కూడా ప్రేక్షకులు కలెక్షన్స్ ఇవ్వకపోతారా అనే ధీమాతో ఉన్నారు. చూడాలి పెద్ద సినిమాల నడుమ ఈ సినిమా నలిగిపోతుందో లేదా కంటెంట్ తో ఇంప్రెస్ చేసి మౌత్ టాక్ తో వసూళ్ళు తెచ్చుకుంటుందో ?

This post was last modified on September 7, 2022 3:51 pm

Share
Show comments

Recent Posts

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

6 minutes ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

3 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

4 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

4 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

4 hours ago

తిరుమలపై ఎందుకీ పగ..?

తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…

5 hours ago