ఒకప్పుడు తన కామెడీ టైమింగ్ తో స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగాడు సునీల్. ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేసి హిట్లు , ఫ్లాపులు రెండూ సొంతం చేసుకున్నాడు. హీరోగా వరుస అపజయాలు రావడంతో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. అయితే సునీల్ చేస్తున్న సినిమాలు అందులో కేరెక్టర్స్ మాత్రం ప్రేక్షకులను నిరాశ పరుస్తూ ఇదేంటి సునీల్ ఇలా అయిపోయాడు చేతికొచ్చిన సినిమాలన్నీ చేస్తున్నాడు అనిపించుకుంటున్నాడు.
నిజమే సునీల్ లేటెస్ట్ మూవీస్ చూస్తే అలానే ఉంది. ‘దర్జా’ , ‘పండు గాడు’, ‘బుజ్జి ఇలా రా’ ఇలా వారానికో సినిమాతో సునీల్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఇందులో ఒక్క సినిమా కూడా అతనికి నటుడిగా ప్లస్ అవ్వలేదు. పైగా డబ్బుల కోసం ఏ సినిమా బడితే ఆ సినిమా చేసేస్తున్నాడనే రిమార్క్ తెచ్చుకుంటున్నాడు. సునీల్ మంచి నటుడు ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కలర్ ఫోటో , పుష్ప లో విలన్ గా మెప్పించాడు. పుష్ప సునీల్ ని పవర్ ఫుల్ విలన్ గా మార్చేసి అతనిలో ఆ యాంగిల్ కూడా ఉందని నిరూపించింది. పుష్ప లో మంగళం శ్రీను గా సునీల్ ఆకట్టుకున్నాడు. గెటప్ , విలనిజం అన్నీ ఎట్రాక్ట్ చేశాయి. ఆ సినిమా పెద్ద హిట్ అయింది కూడా.
ఇకపై సునీల్ పెద్ద సినిమాల్లో ఆ టైప్ విలన్ కేరెక్టర్స్ , అలాగే ఇంపార్టెంట్ రోల్స్ చేస్తాడని అనుకుంటే వరుసగా చిన్న సినిమాలు చేస్తూ సిల్లీ పాత్రలతో కనిపిస్తున్నాడు. పుష్ప సక్సెస్ ను బేస్ చేసుకొని బడా సినిమాలు చేయకుండా తన దగ్గరికి వచ్చిన ప్రతీ చిన్న సినిమాలో నటిస్తూ కెరీర్ గ్రాఫ్ తగ్గించుకుంటున్నాడు. మహేష్ -త్రివిక్రమ్, కొరటాల శివ -ఎన్టీఆర్ సినిమాల్లో సునీల్ నటించనున్నాడని టాక్ ఉంది. మరి ఇప్పటికైనా చిన్న సినిమాలు తగ్గించి సిల్లీ పాత్రలు గుడ్ బై చెప్పేసి సీరియస్ ఇంటెన్స్ ఉన్న పాత్రలు చేస్తూ సునీల్ బడా సినిమాలతో బిజీ అయితే బాగుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
This post was last modified on September 7, 2022 12:15 pm
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…