అసలు పెద్దగా అంచనాలు లేకుండా తెలుగులో రిలీజ్ కావడానికే కొంత ఇబ్బంది పడ్డ కార్తికేయ 2 జోరు నాలుగో వారంలోనూ యమా స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ దీన్ని సొంతం చేసుకోగా మరోసారి సౌత్ సినిమా సత్తాను చాటినట్టు అయ్యింది. శ్రీకృష్ణ తత్వాన్ని ఒక ట్రెజర్ హంట్ మోడల్ లో దర్శకుడు చందూ మొండేటి చూపించిన తీరుకి ముంబై లాంటి నగరాల్లో వసూళ్ల వర్షం కురుస్తోంది.
గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆగ్రా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో నిఖిల్ బొమ్మ తాకిడి మాములుగా లేదు. సోషల్ మీడియా మద్దతు విపరీతంగా పెరిగిపోవడం మరో సానుకూలాంశం. మరో అరుదైన ఘనత కార్తికేయ 2 సొంతమయ్యింది. హిందీ డబ్బింగ్ వెర్షన్లలో టాప్ 10 కలెక్షన్లలో చోటు దక్కించుకుంది. అది కూడా ఇంకా ఫైనల్ రన్ దాటకుండానే. పదో స్థానంలో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి(28 కోట్లు)ని దాటేసి గర్వంగా తొమ్మిదో ప్లేస్ ని అందుకుంది.
తాజాగా నిఖిల్ సినిమా 29 కోట్ల మార్క్ అందుకుంది. అంతేసి ప్రశంసలు దక్కించుకున్న మాధవన్ రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ కేవలం 26 కోట్లతో పదకొండో స్థానానికి పరిమితం కాగా ప్రభాస్ రాధే శ్యామ్ 13వ ర్యాంక్ లో 19 కోట్ల 30 లక్షల దగ్గర ఆగిపోయింది. కార్తికేయ 2కి ఇది ఊహించని రికార్డు. ఇప్పుడు దీని ముందున్న నెక్స్ట్ టార్గెట్ కెజిఎఫ్ చాప్టర్ 2. అయితే అదంతా సులభం కాదు. ఎందుకంటే రాఖీ భాయ్ 44 కోట్లతో ఎనిమిదో ప్లేస్ లో తిష్టవేసుకుని కూర్చుకున్నాడు. ఇది క్రాస్ చేసినా చాలు.
అయితే బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ వచ్చాక ఆ ఎఫెక్ట్ బలంగా ఉంటుంది కాబట్టి సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ దాని టాక్ అటుఇటు అయినా మళ్ళీ పుంజుకోవచ్చు. ఇప్పుడీ ఎఫెక్ట్ కార్తికేయ 1 మీద పడి అది ఏ ఓటిటిలో దొరుకుతోందో వెతికి మరీ చూసేస్తున్నారు బాలీవుడ్ జనాలు. మొత్తానికి నిఖిల్ తీసుకున్న గ్యాప్ కి, పడిన కష్టానికి, అనుభవించిన ఆవేదనకు మంచి ఫలితాన్ని దక్కించుకున్నాడు.
This post was last modified on September 6, 2022 9:25 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…